Monday, April 29, 2024

జూలై 10న ముగియనున్న “షోడ‌శ‌దినాత్మ‌క అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష”

- Advertisement -
- Advertisement -

Shodasadina Aranyakanda Parayana Deeksha to end

తిరుమల: సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, స‌క‌ల కార్యాలు సిద్ధించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపట్టిన “షోడ‌శ‌దినాత్మ‌క‌ అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష” జూలై 10వ తేదీ పూర్ణాహుతితో ముగియనుంది. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో జూన్ 25న ఈ దీక్ష ప్రారంభమైంది. “రామ‌స్య‌పాదౌజ‌గ్రాహ‌ల‌క్ష్మ‌ణ‌స్య‌చ‌ధీమ‌తః” అనే మహామంత్రం ప్రకారం అర‌ణ్య‌కాండలోని మొత్తం 75 స‌ర్గ‌ల్లో 2,454 శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు. వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, త‌ర్ప‌ణ‌, హోమాదులు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌లకు ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. ఈ ప్రకటన టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News