Monday, April 29, 2024

డిసెంబర్‌లో రొమాంటిక్ సీన్స్…

- Advertisement -
- Advertisement -

Shruti Haasan to join Vakeel Saab in December

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం ‘వకీల్ సాబ్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో పవన్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో పవన్‌తో పాటు హీరోయిన్ శృతి హసన్ కూడా సెట్స్ లో చేరనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తరువాత దీనిపై ఎటువంటి సమాచారం లేదు. నిజానికి శృతి షెడ్యూల్ ఇప్పట్లో లేదట. డిసెంబర్ నుండి ఈ భామ ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో పాల్గొనుందట. డిసెంబర్‌లో పవన్, శృతిలపై ముఖ్యమైన సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్స్ తెరకెక్కిస్తారట. ఇక వీరిద్దరి కాంబినేషన్ అనగానే ‘గబ్బర్ సింగ్’ గుర్తుకు వస్తుంది. ఆ మూవీలో పోలీసాఫీసర్‌గా పవన్ కల్యాణ్ నటిస్తే.. చూపులతోనే ప్రేమలో పడేసే భాగ్యలక్ష్మిగా శృతిహాసన్ నటించింది. పవన్ కమ్‌బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అంజలి, నివేదా థామస్,- అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్ సహకారంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పిక్’కి రీమేక్ ఇది.

Shruti Haasan to join Vakeel Saab in December

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News