Monday, April 29, 2024

గజల్ గాయకుడు భూపిందర్ సింగ్ ఇకలేరు…

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్ర‌ఖ్యాత గ‌జ‌ల్ గాయ‌కుడు భూపింద‌ర్ సింగ్ (82) క‌న్నుమూశారు. కొల‌న్ క్యాన్స‌ర్ వ్యాధితో పాటు కరోనా వైరస్ సోకడంతో తుదిశ్వాస విడిచారని ఆయన భార్య మితాలి సింగ్ తెలిపారు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎన్నో హిట్ పాటల‌ను భూపింద‌ర్ పాడారు. నామ్ గుమ్ జాయేగీ, దిల్ దూండ్‌తా హై లాంటి పాపుల‌ర్ పాట‌ల‌తో పాటు దో దివానే షెహ‌ర్ మే, ఏక్ అకేలా ఇస్ షెమ‌ర్ మే, తోడీ సీ జ‌మీన్ తోడా ఆస్మాన్‌, దునియా చుటే యార్ నా చుటే, క‌రోగి యాద్ లాంటి గీతాలను ఆయ‌న ఆలపించారు.  గత కొన్ని రోజుల నుంచి మూత్ర ఇన్‌ఫెక్ష‌న్ రావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రముఖ గాయకులు ల‌తా మంగేష్క‌ర్‌, ఆశా భోంస్లే, గుల్జార్‌, బ‌ప్పిల‌హ‌రి, ర‌ఫి, బ‌ర్మ‌న్‌, మ‌ద‌న్ మోహ‌న్లతో క‌లిసి ప‌నిచేశారు. ద‌మ్ మారో ద‌మ్‌, చురా లియా హై, చింగారి కోయి బ‌డ్కే, మెహ‌బూబా ఓ మెహ‌బూలా లాంటి పాట‌ల‌కు గిటారిస్ట్‌గా సేవలందించారు. భూపింద‌ర్ సింగ్ మృతి ప‌ట్ల మ‌హారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News