Friday, May 17, 2024

ప్రభుత్వ పాఠశాల ఇలా.. ఆదర్శంగా సిరిసిల్ల

- Advertisement -
- Advertisement -

విద్యార్థులు 1000 మంది
32 డెస్క్‌టాప్‌లతో కంప్యూటర్ ల్యాబ్
లైబ్రరీ, సైన్స్ ల్యాబ్
12 సిసి కెమెరాలు
డిజిటల్ లెర్నింగ్, ఫస్ట్‌ఎయిడ్ వగైరాలు

ఆధునీకరించిన సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలను ప్రస్తావిస్తూ మంత్రి కెటిఆర్ ట్వీట్

రాష్ట్రమంతటా ఇలా ఉండాలన్నదే నా కల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలగా మారాలన్నదే తన కల అని ఐటి మంత్రి కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. సిరిసిల్ల గీతా నగర్‌లోని జెడ్‌పి ఉన్నత పాఠశాలను సిఎస్‌సి, పిపిపి విధానంలో ఆధునీకరించినట్లు పేర్కొన్నారు. 32 డెస్క్‌టాప్‌లతో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, డైనింగ్ హాల్, టర్ఫ్‌తో ఫిఫా క్వాలిటీ ఫుడ్‌బాల్ గ్రౌండ్, 12 సిసిటివి కెమెరాలు, హైస్పీడ్ ల్యాన్, వైఫై సౌకర్యం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వెయ్యి మంది విద్యార్థుల సామర్థం కలిగిన ఈ పాఠశాలలో డిజిటల్ లెర్నింగ్, ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌తో కూడిన సిక్ రూమ్‌తో పాటు టీచర్లకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News