Monday, April 29, 2024

ఆస్కార్ ఉత్తమ నటుడు విల్‌స్మిత్

- Advertisement -
- Advertisement -

ఉత్తమ నటిగా జెస్సికా చాస్టెయిన్, ఉత్తమ దర్శకుడిగా
జేన్ కాంపెయిన్‌కు అవార్డులు, ఉత్తమ చిత్రంగా ‘కోడా’

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో హాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ వేడుకలో మొత్త 23 విభాగాల్లో అవార్డులు అందజేశారు. ఉత్తమ చిత్రంగా ‘కోడా’, ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), ఉత్తమ నటిగా జెస్సికా చాస్టెయిన్ ( ది ఐస్ ఆఫ్ టామీ ఫే), ఉత్తమ దర్శకుడిగా జేన్ కాంపెయిన్ (ది పవర్ ఆఫ్ డాగ్) నిలిచి ఆస్కార్ అవార్డులు దక్కించుకున్నారు. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో పోటీపడిన భారతీయ చిత్రం ‘రైటింగ్ విత్ ఫైర్’కు నిరాశే ఎదురైంది. ఈ అవార్డును ‘సమ్మర్ ఆఫ్ సోల్’ కైవసం చేసుకుంది.

ఆస్కార్ అవార్డుల వివరాలు:

ఉత్తమ చిత్రం : కోడా
ఉత్తమ దర్శకుడు : జేన్ కాంపియన్
(ది పవర్ ఆఫ్ డాగ్)
ఉత్తమ నటుడు : విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
ఉత్తమ నటి : జెస్సికా చాస్టెయిన్
(ది ఐస్ ఆఫ్ టామీ ఫే)
ఉత్తమ సహాయ నటుడు : ట్రాయ్ కొట్సూర్ (కోడా)
ఉత్తమ సహాయ నటి : అరియానా డిబోస్
(వెస్ట్‌సైడ్ స్టోరీ)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : సియాన్ హెడర్ (కోడా)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : కెన్నెత్ బ్రానాగ్ (బెల్ ఫాస్ట్)
ఉత్తమ కాస్య్టూమ్ డిజైన్ : జెన్నీ బేవన్ (క్రుయెల్లా)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్)
ఉత్తమ అంతర్జాతీయ
చలన చిత్రం : డ్రైవ్ మై కార్ (జపాన్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : బిల్లీ ఎలిష్ (నో టైమ్ టూ డై)
ఉత్తమ సౌండ్ : థియో గ్రీన్, హెమ్‌ఫిల్,
మార్క్ మాంగినీ,
రాన్ బార్ట్‌లెట్ (డ్యూన్)
ఉత్తమ యానిమేటేడ్
ఫిచర్ ఫిల్మ్ : ఎన్‌కాంటో
ఉత్తమ యానిమేటేడ్
షార్ట్ ఫిల్మ్ : ది విండ్‌షీల్ వైపర్
ఉత్తమ డాక్యుమెంటరీ
(ఫీచర్) : సమ్మర్ ఆఫ్ సోల్
ఉత్తమ డాక్యుమెంటరీ
(షార్ట్ సబ్జెక్ట్) : ది క్వీన్ ఆఫ్ బాస్కెట్‌బాల్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్
(లైవ్ యాక్షన్) : ది లాంగ్ గుడ్‌బై
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ : డ్యూన్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ : డ్యూన్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : డ్యూన్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : డ్యూన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News