Monday, April 29, 2024

సంక్రాంతికి 36 ప్రత్యేకరైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందులో సికింద్రాబాద్- టు కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్- టు కాకినాడ టౌన్ మధ్య కూడా రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు…
ప్రత్యేక రైలు నెం.07021 ఈనెల 11వ తేదీ రాత్రి 09 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. అలాగే కాకినాడ నుంచి 07022 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 12వ తేదీ సాయంత్రం 05.40 గంటలకు కాకినాడ పట్టణంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు నెం. 07023 జనవరి 12వ తేదీ సాయంత్రం 06.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నెం. 07024 జనవరి 13వ తేదీ రాత్రి 10.00 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ప్రత్యేక రైళ్లు నడిచే స్టేషన్లు…
సికింద్రాబాద్- టు కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్‌లో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ టు -కాకినాడ టౌన్ మధ్య నడిచే రెండు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగు రాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్‌లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
32 ప్రత్యేక రైళ్ల వివరాలు…
రైలు నం. 07089 సికింద్రాబాద్ టు బ్రహ్మపూర్ – ఈనెల 7, 14వ తేదీ, రైలు నెం. 07090 బ్రహ్మపూర్ -టు వికారాబాద్ – జనవరి 8, 15వ తేదీల్లో, రైలు నెం. 07091 వికారాబాద్ టు -బ్రహ్మాపూర్ – జనవరి 9, 16వ తేదీల్లో, రైలు నెం. 07092 బ్రహ్మపూర్ టు- సికింద్రాబాద్ – జనవరి 10, 17వ తేదీల్లో రైలు నెం. 08541 విశాఖ -టు కర్నూలు సిటీ – జనవరి 10, 17, 24వ తేదీల్లో రైలు నెం. 08542 కర్నూలు సిటీ -టు విశాఖ పట్నం – జనవరి 11, 18, 25వ తేదీల్లో, రైలు నెం. 08547 శ్రీకాకుళం -టు వికారాబాద్ – జనవరి 12, 19, 26వ తేదీల్లో, రైలు నెం. 08548 వికారాబాద్ టు- శ్రీకాకుళం – జనవరి 13, 20, 27వ తేదీల్లో, రైలు నెం. 02764 సికింద్రాబాద్ -టు తిరుపతి – జనవరి 10, 17, రైలు నెం. 02763 తిరుపతి -టు సికింద్రాబాద్ – జనవరి 11, 18వ తేదీల్లో, రైలు నంబర్ 07271 సికింద్రాబాద్ -టు కాకినాడ – జనవరి 12వ తేదీల్లో, రైలు నెం. 07272 కాకినాడ టౌన్ – టు సికింద్రాబాద్ – జనవరి 13వ తేదీ, రైలు నం. 07093 సికింద్రాబాద్ టు- బ్రహ్మపూర్ – జనవరి 8, 15వ తేదీల్లో, రైలు నెం. 07094 బ్రహ్మపూర్ టు- సికింద్రాబాద్ – జనవరి 9, 16వ తేదీల్లో, రైలు నంబర్ 07251 నర్సాపూర్ టు- సికింద్రాబాద్ – జనవరి 10వ తేదీల్లో, రైలు నంబర్ 07052 సికింద్రాబాద్ -టు నర్సాపూర్ – జనవరి 11వ తేదీల్లో.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News