Monday, April 29, 2024

నేలకొరిగిన వేలాది వృక్షాలు

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం దక్షిణ కొరియాపై ఖానున్ అనే శక్తివంతమైన తుపాను ప్రభావం చూపుతోంది. దక్షిణ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. జియావోజే, చాంగ్వాన్ నగరాల్లో, అనేక గృహాలు ధ్వంసమయ్యాయి. పైకప్పులు నలిగిపోయాయి. చెట్లు నేలకూలాయి. యోంగ్జే జిల్లా భారీ వరదలను ఎదుర్కొంటోంది.

ఉల్సాన్, పోహాంగ్, గిమ్‌చియోన్‌లకు వరద హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. దక్షిణ కొరియా అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ మృతుల సంఖ్యను ఇంకా ధృవీకరించలేదు. తుపాన్‌ కారణంగా అనేక మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందుజాగ్రత్తగా పాఠశాలలు, రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. తుఫాను ఇప్పుడు సియోల్ వైపు పయనిస్తోంది. రేపటిలోగా ఉత్తర కొరియాకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News