Thursday, May 9, 2024

ఓటర్ స్లిప్, పోలింగ్ బూత్‌లు.. తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్

- Advertisement -
- Advertisement -

Special app For Voter slip and polling booths

యాప్‌పై అవగాహన ప్రచారం చేస్తున్న జిహెచ్‌ఎంసి

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేవారు తమ ఓటరు స్లిప్‌ను, పొందడంతో పాటు సమీప పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను జిహెచ్‌ఎంసి రూపొందించింది. ఇప్పటికే నగరంలో ఓటర్ స్లిప్ పంపిణీ చేసే కార్యాక్రమాన్ని జిహెచ్‌ఎంసి చేపట్టింది. అయితే నగర ఓటర్లలో అధికశాతం మందికి మోబైల ఫోన్‌లు ఉండటంతో అరచేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్‌స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవిధంగా ఈ మోబైల్ యాప్‌ను రూపొందించింది.

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో మై జిహెచ్‌ఎంసి యాప్‌లో నో.. యువర్ పోలింగ్ స్టేషన్‌ను ఆప్షన్లో క్లిక్ చేసి ఓటరు పేరు, వార్దు పేరు, ఎంటర్ చేస్తే ఓటర్‌స్లిప్‌తో పాటు పొలింగ్‌బూత్ ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్ లోకేషన్ వస్తుంది. పేరుకు బదులు గుర్తింపు కార్డు నెంబర్,వార్దు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్ వస్తుంది. ఈ నో యువర్ పోలింగ్ స్టేషన్‌యాప్‌పై చైతన్యం కలిగిచేందుకు జిహెచ్‌ఎంసి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్ షెల్టర్‌లపై ఫెక్లీలను ఏర్పాటు చేయడం, ఎఫ్.ఎం. రేడియోలలో జింగిల్స్ ప్రసారం, టెలివిజన్ చానెళ్ళల్లో స్క్రోలింగ్‌లను ఏర్పాటు చేశారు. ఈ యాప్ పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సప్ ద్వారా సమాచారం అందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News