Monday, April 29, 2024

భారత్ ను బేఖాతరు చేసి చైనా నౌకను అనుమతించిన శ్రీలంక

- Advertisement -
- Advertisement -

 

China ship in Sri Lanka

కొలంబో: సైనిక సంస్థాపనల(ఇన్ స్టాలేషన్స్)పై గూఢచర్యం చేయొచ్చు కనుక చైనా నౌకకు అనుమతించొద్దని భారత్ చేసిన సూచనను శ్రీలంక బేఖాతరు చేసి అనుమతించింది. యువాన్ వాంగ్ 5 అనేది పరిశోధన, సర్వే చేసే నౌక. అంతేకాక సైట్స్ ను విశ్లేషిస్తుంది. కాగా అది డ్యూయల్ యూజ్ గూఢచర్య నౌక అని భారతీయ మీడియా కోడై కూసింది. చైనా  హిందూ మహాసముద్రంలో ఉనికిని చాటుకోవడం, శ్రీలంకపై ప్రభావం చూపడం అనేక అనుమానాలకు తావు ఇస్తోంది. కాగా ఆగస్ట్ 16 నుండి 22 వరకు హంబన్‌తోట వద్దకు వెళ్లేందుకు ఓడకు విదేశాంగ శాఖ అనుమతి లభించిందని శ్రీలంక హార్బర్ మాస్టర్ నిర్మల్ పి సిల్వా తెలిపారు.

భారతీయ నివేదికల ప్రకారం, యువాన్ వాంగ్ 5 అంతరిక్షం , ఉపగ్రహ ట్రాకింగ్ కోసం ఉపయోగించవచ్చు , ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలలో నిర్దిష్ట ఉపయోగాలు కలిగి ఉంది. కాగా న్యూఢిల్లీ విదేశాంగ మంత్రిత్వ శాఖ “భారత భద్రత , ఆర్థిక ప్రయోజనాలపై ఏదైనా ప్రభావం చూపితే వాటిని నిశితంగా పరిశీలిస్తుందని, వాటిని రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని” తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News