Sunday, April 28, 2024

కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటుంది సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Srinivas Goud Distributing Exgratia To Toddy Tappers

మృతిచెందిన గీత కార్మికుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తాం
దేశంలో ఎక్కడా లేని విధంగా నీరాపాలసీని తీసుకొచ్చాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్: కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత, తాత్కాలిక అంగ వైకల్యం పొందిన కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13.96 కోట్ల ఆర్థిక సాయం అందించిందని ఆయన తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో కల్లుగీత కార్మికులకు అభయహస్తం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన, వికలాంగులైన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కులవృత్తులు చేసుకునే వారు ఆత్మగౌరవంతో బ్రతికేలా పాటుపడుతోన్న ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

మృతిచెందిన గీత కార్మికుల కుటుంబాల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించేందుకు శాఖ తరఫున చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నీరాపాలసీ, గౌడ కులస్థులే కల్లు గీసేలా ప్రత్యేక జిఓ తెచ్చిన ఘనత తమదేనని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. త్వరలో కోకాపేటలో గౌడ కులస్థుల సంక్షేమ భవన నిర్మాణం చేపడతామని, గీత కార్మికులకు స్పెషల్ డిజైన్ మోపెడ్‌లను అందజేస్తామని మంత్రి ప్రకటించారు. గౌడన్నలు గౌరవప్రదంగా బ్రతికేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాంక్‌బండ్‌పై రూ. 20 కోట్లతో నీరా కేఫ్

ట్యాంక్‌బండ్‌పై రూ. 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్‌లను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
మొత్తం 588 మంది కల్లుగీత కార్మికుల
ప్రమాదవశాత్తు మృతిచెందిన 126 మంది కల్లుగీత కార్మికులకు రూ.5లక్షల చొప్పున, శాశ్వత వైకల్యం పొందిన 147 మందికి రూ.5లక్షల చొప్పున, శాశ్వత వైకల్యం పొందిన 147 మందికి రూ.5 లక్షలు, తాత్కాలిక అంగవైకల్యం పొందిన 315 మందికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. మొత్తం 588 మంది కల్లుగీత కార్మికుల కుటుంబాలకు మొత్తం రూ.13.96 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు మంత్రి తెలిపారు.

అన్నికులస్థులు ఆత్మగౌరవంతో బ్రతికేలా…. మంత్రి తలసాని

రాష్ట్రంలో అన్నికులస్థులు ఆత్మగౌరవంతో బ్రతికేలా తమ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్యకారులకు వ్యక్తిగత వాహనాలు సమకూర్చినట్లుగా గీత కార్మికులకు త్వరలో మోపెడ్‌లు అందజేస్తామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News