Monday, April 29, 2024

న్యాయం, ధర్మం గెలిచింది.. హైకోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్‌: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఎన్నిక చెల్లదని జిల్లాకు చెందిన రాఘవేందర్ రాజు వేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ… ” న్యాయం, ధర్మం గెలుస్తుందని జిల్లా ప్రజలకు ముందే తెలుసు. గతంలో జిల్లాను పాలించిన ఇద్దరు నేతలు వారి అస్థిత్వం కోసం తనపై అక్రమ కేసులు వేయించారు. జిల్లా అభివృద్ధిని చూసి ఓర్వలేక బిసిలను అడ్డం పెట్టుకుని కేసులు వేయించారు. గత పాలనలో జిల్లా కరువు, వలసల కష్టాలతో అల్లాడిపోయింది. రాష్ట్రం వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో మహబూబ్ నగర్ జిల్లా పచ్చని పంటలతో కలకలాడుతోంది. వచ్చ ఎన్నికల్లో కూడా ప్రజలు బిఆర్ఎస్ పార్టీకే మళ్లీ అధికారం అప్పగిస్తారు. మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం” అని పేర్కొన్నారు.

కాగా, 2018 ఎన్నికల అఫిడవిట్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన ఆస్తులు, అప్పులకు సంబంధి తప్పుడు వివరాలు పొందుపర్చారని 2019లో రాఘవేంద్రరాజు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు.శ్రీనివాస్ గౌడ్ ఎంఎల్‌ఎగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రాఘవేంద్రరాజు పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి అభ్యంతరాలు పరిశీలించాలని ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News