Monday, April 29, 2024

కూతురిపై మారుతండ్రి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Step-father rapes daughter in Hyderabad

హైదరాబాద్: కూతురిపై మారుతండ్రి అత్యాచారం చేసిన సంఘటన నగరంలోని టపాచపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆసిఫ్‌నగర్, రాయల్ సీ హోటల్‌కు చెందిన ఓ మహిళతో, సయిద్ సైఫుల్లాకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇది సైఫుల్లాకు మూడో వివాహం, ఆ మహిళకు కూడా గతంలో వివాహం జరగగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారితో కలిసి సైఫుల్లాతో ఉంటోంది. పదిహేను రోజుల క్రితం మహిళ పెద్ద కూతురు తెల్లవారుజామున 5గంటలకు కేకలు వేయడంతో లేచి చూసే సరికి సైఫుల్లా అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్నాడు. వెంటనే దానిని అడ్డుకునేందుకు యత్నించగా సైఫుల్లా అడ్డుకుంటే కుటుంబం మొత్తం చంపివేస్తామని హెచ్చరించడంతో వెనక్కి తగ్గింది. దీంతో నిందితుడు బాలికపై అత్యాచారం చేశాడు. కొద్ది రోజులు మౌనంగా ఉన్న ఆ మహిళ తండ్రి ఎండి యూసుఫ్ ఇంటికి రావడంతో విషయం చెప్పింది. దీంతో ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News