Monday, April 29, 2024

లాభాల స్వీకరణ.. 333 పాయింట్లు డౌన్

- Advertisement -
- Advertisement -

ముంబై : లాభాల స్వీకరణ కారణంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,053 పాయింట్ల పతనంతో 70,370 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 333 పాయింట్లు నష్టపోయి 21,238 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్ షేర్లలో అధికంగా క్షీణత నమోదైంది. జీ-, సోనీ విలీన ఒప్పందం రద్దు తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు 30 శాతం పడిపోయాయి. ఈ స్టాక్ రూ.70.50 (30.47 శాతం) పతనంతో రూ.160.90 వద్ద ముగిసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 3.45 శాతం పడిపోయాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఈ బ్యాంక్ వెయిటేజీ ఎక్కువగా ఉండడంతో మార్కెట్ భారీ పతనాన్ని చూడాల్సి వచ్చింది. మరో పెద్ద స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం పడిపోయాయి. ఇది మార్కెట్ల క్షీణతను కారణమైంది. అయితే ఈ నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఇప్పటివరకు రూ.13 వేల కోట్లను విక్రయించారు. దీంతో మార్కెట్ నష్టాలను చవిచూసింది. మంగళవారం ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్‌లో రూ.8 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. అయితే పునరుత్పాదక ఇంధన సంస్థల షేర్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన సూర్యోదయ యోజన వల్ల ఈ షేర్లు పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News