Saturday, April 27, 2024

పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థపై ఓ విద్యార్థి వీడియో సందేశం

- Advertisement -
- Advertisement -

sanitation workers

 

హైదరాబాద్ : దేశాభివృద్ధికి పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఎంత అవసరమో, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థను తెలిపే ఓ చిన్న నిడివితో ఉన్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. ఈ వీడియో రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్‌ను విశేషంగా ఆకట్టుకుంది. మంత్రి కెటిఆర్ ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తూ ప్రతిఒక్కరూ చూడాల్సిందిగా కోరారు.

ఆ సందేశం పూర్తి వివరాలు ఇలా
వీడియోలో ఓ విద్యార్థి తన తండ్రి పని ప్రాముఖ్యాన్ని కళ్లకు కట్టినట్టుగా తెలియచేశారు. ఆ సందేశం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నా తండ్రి దేశాన్ని నడిపిస్తున్నాడు. అతనేమీ నాయకుడు కాదు, అయినా దేశాన్ని నడిపిస్తున్నాడు. నా తండ్రి డాక్టర్ కాదు, కానీ రోగాల్ని దగ్గరికి రానీవ్వడు. నా తండ్రి పోలీస్ కాదు, కానీ దేశంలోని చెడుని తీసేస్తాడు. ఆర్మీ కూడా కాదు, కానీ దుష్టశక్తులపై పోరాడుతాడు.

మా నాన్న ఒక్క రోజు పనికి వెళ్లకపోతే…
కానీ మా నాన్న ఒక్క రోజు పనికి వెళ్లకపోతే దేశంలోని ప్రతి ఇళ్లు ఆగిపోతుంది. ఇంట్లో అన్నం వండుకోలేరు. స్నానాలు ఉండవు. అందరూ వీధుల్లోనే ఆగిపోతారు. డాక్టర్లు ఆస్పత్రికి చేరుకోలేరు. విద్యార్థులు పాఠశాలలకు చేరుకోలేరు. మంత్రులు సచివాలయానికి పోలేరు. దేశం మొత్తం దిక్కులేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనందరి జీవితాల్ని సులభతరం చేస్తాడు మా నాన్న. ఎవరి తండ్రి చేయాలనుకొని పనిని మా నాన్న చేస్తాడు అంటూ కొనసాగుతుంది ఈ వీడియో.

ప్రతిరోజు 4 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థపదార్థాల ఉత్పత్తి
సమస్య తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు చర్యలు, పరిసరాల పరిశుభ్రతకు పెద్దఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 4 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థపదార్థాలు ఉత్పత్తి అవుతున్నట్టుగా సమాచారం. ప్లాస్టిక్ పదార్థాలతో, తడి, పొడి చెత్త కలయికల వ్యర్థాల తరలింపు అత్యంత సమస్యాత్మకంగా మారింది. దీంతో తడి, పొడి చెత్తను వేరు చేయడం తమ తమ ఇంటి నుంచే ప్రారంభం కావాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేయడానికి ప్రతి ఇంటికి రెండు డస్ట్‌బిన్‌లను అందజేసింది. అదేవిధంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా చేయడానికి అవగాహన నిమిత్తం స్వచ్ఛ వలంటీర్లను ఏర్పాటు చేసింది.

https://twitter.com/i/status/1229650531834040320

Student video message on plight of sanitation workers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News