Monday, April 29, 2024

గ్రేటర్‌లో మళ్లీ కరోనా పంజా

- Advertisement -
- Advertisement -

Students are mostly suffering from Coronavirus

రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య
హయత్‌నగర్‌లో 30,బోయిన్‌పల్లిలో 34మంది విద్యార్దులకు వైరస్
బడులకు వెళ్లాలంటే భయపడుతున్న విద్యార్దులు
వసతి గృహాల నుంచి చిన్నారులను తీసుకెళ్లుతున్న తల్లిదండ్రులు
పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలో టెస్టులు పెంచిన ఆరోగ్యశాఖ
కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ముప్పతప్పదని వైద్యుల హెచ్చరికలు

హైదరాబాద్: మహానగరంపై కరోనా మరోసారి పంజా విసురుతుంది. విద్యార్దులు ఎక్కువ సంఖ్య వైరస్ భారిన పడుతున్నారు. దీంతో చిన్నారులను పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు వణుకుతున్నారు. గత ఐదారు రోజుల నుంచి వరుసగా స్కూల్స్, హాస్టల్స్‌లో కేసులు పెరుగుతుండటంతో నగరమంతా వ్యాప్తించే అవకాశముందని జిల్లా వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు భారీ నమోదు కావడంతో లాక్‌డౌన్ విధించారు. అప్పటి నుంచి నగర ప్రజలు మరోసారి కరోనా కాటు వేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి చెందిన ప్రజలు ముంబాయికి రోజుకు వేలాది రాకపోకలు సాగిస్తుంటడంతో మరోసారి వైరస్ రెక్కలు కట్టుకుంటుందని జంకుతున్నారు. నాలుగు రోజుల కితం నాగోల్ బండ్లగూడ మైనార్టీ సంక్షేమ పాఠశాలలో 38మంది విద్యార్దులతో పాటు, సమీపంలో ఉండే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి వైరస్ సోకింది.

మరుసటి రోజు కూకట్‌పల్లిలోని ఓప్రైవేటు కళాశాలకు చెందిన 15మంది విద్యార్దులకు రాగా, గురువారం రాజేంద్రనగర్‌లోని ఎస్టీ సంక్షేమ హాస్టల్‌లో 23మంది చిన్నారులకు పాజిటివ్ వచ్చింది. శనివారం హయత్‌నగర్‌లోని ఓస్కూల్‌కు చెందిన 30మంది విద్యార్దులకు, సికింద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన ప్రభుత్వ వసతిగృహాంలోని 34 మంది విద్యార్దులతో పాటు హాస్టల్ వార్డెన్‌కు వైరస్ సోకినట్లు బయటపడింది. దీంతో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులతో పాటు మిగతా స్టాప్‌కు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. స్కూల్‌లో కోవిడ్ నిబంధనలు సక్రమంగా పాటించకపోవడంతో వైరస్ విజృంభించిందని, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న విద్యార్దులను గుర్తించకుండా నిర్లక్షంగా ఉంటున్నారని విద్యార్దులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోపక్క వైద్యాధికారులు ఎలాంటి లక్షణాలు లేకున్న పాజిటివ్ వస్తుందని చెబుతున్నారు.అదే విధంగా స్దానిక ప్రజలు కూడా అనుమానం ఉంటే వెంటనే సమీపంలోని పట్టణా ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలో పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు 50మంది ఉచితంగా టెస్టులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొంటున్నారు. పాతబస్తీలోని యాకుత్‌పురా, సైదాబాద్, కుల్సంపురా, పురాన్‌పూల్, బండ్లగూడ వంటి యుపిహెచ్‌లకు టెస్టుల కోసం ప్రజలు క్యూ కడుతున్నట్లు ఆయా ఆసుపత్రుల వైద్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. పాఠశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్కూల్స్‌ను మూసివేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్దులను పై తరగతులకు ప్రమోట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు, అదే విధంగా ఉన్నత పాఠశాల విద్యార్దులకు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించి, మేలోనే పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు నగర ప్రజలు కరోనా టీకా వచ్చిందని, కోవిడ్ నిబంధనలు పాటించడంలేదని, బయటకు వెళ్లితే ముఖానికి తప్పకుండా మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని, అదే విధంగా వైరస్ వ్యాప్తిచెందకుండా స్దానిక ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ, ఆశలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. నగర ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా కరోనా కాటుకు బలికాక తప్పదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News