Monday, April 29, 2024

గణనీయంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్‌పేట్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పూంచాయతీలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ఆయన మండల పరిధిలోని గోవిందపూర్ గ్రామంలో ఇరవై లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అలాగే ముప్పైఐదు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణపు పనులకు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోనే గోవిందపూర్ ఉత్తమ గ్రామపంచాయతీగా ఎదిగిందన్నారు. ఇంకా ఏమైనా పనులు అవసరముంటే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. సర్పంచ్ కావలి ఆశమ్మ పని తీరును ప్రశంసించారు. గ్రామం పరిశుభ్రంగా ఉందన్నారు.బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నయకులు బైండ్ల బిచ్చయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతమైంది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కావలి ఆశమ్మ, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకన్న, పీఏసీఎస్ ఛైర్మన్ విష్ణువర్థన్‌రెడ్డి, బైండ్ల బిచ్చన్న, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, గ్రామ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ఈడిగి రాధయ్య, చింతలపల్లి సాయన్న, భీంరావ్, గజాల, కావలి సాయన్న, బైండ్ల నర్సింహులు, మహిపాల్, అధికారులు ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News