Monday, April 29, 2024

ఎఫ్‌ఐఆర్ రద్దుకై అనిల్‌దేశ్‌ముఖ్ వేసిన పిటిషన్‌కు సుప్రీం తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

Supreme Court rejects Anil Deshmukh's petition to quash FIR

 

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అవినీతి కేసులో సిబిఐ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అనిల్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ డివై చంద్రచూడ్,ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలు సరైనవేనని స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు జులై 22న తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. సిబిఐ దర్యాప్తుపై మధ్యలోనే జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News