Wednesday, May 1, 2024

తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించిన కేసు నమోదైన విషయం విదితమే. ఇతనితో పాటు మరో ఆరుగురు పైనా కేసులు నమోదు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, వారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 28 నుంచి మౌలానా సాద్ స్వీయ క్వారంటైన్‌లో ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించనట్లు సమాచారం. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు కారకులనే ఆరోపణలు ఉన్నాయి.

కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను ఎగతాళి చేస్తూ మరణం అల్లా అనుమతితో జరుగుతుంది. అల్లా ఆపాలనుకుంటే మనం చచ్చిపోతామా? అల్లా చంపాలనుకుంటే వీళ్లు బతికిస్తారా? అంటూ ఆడియో టేపులు కూడా సాద్ విడుదల చేశాడు. తాను కూడా కరోనా బాధితుడినేనని, సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నానని మౌలానా ప్రకటించుకున్నాడు. ఇతని కోసం పోలీసులు ఢిల్లీలోని తజీమ్ ఘర్ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల గాలిస్తున్న క్రమంలో సాద్ స్వీయ క్వారంటైన్ పూర్తికావడంతో పోలీసులకు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

హత్యకేసు నమోదు:

తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా సాద్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి కారకులయ్యారంటూ జమాతేపై కూడా ఐపిసి 304 ప్రకారం హత్యకేసు నమోదు చేశారు. ఇప్పటికే మౌలానా సాద్ సెల్ఫ్ క్వారంటైన్ సమయం పూర్తికావడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ సాద్‌కు పోలీసులు రెండు నోటీసులు పంపారు. తబ్లీగీ జమాతే మర్కజ్ సదస్సుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చినవారి నుంచి సదస్సులో పాల్గొన్న మిగతావారికి కరోనా సోకినట్లుగా అధికారులు తేల్చారు. అనేక రాష్ట్రాల్లో జమాతే సభ్యుల ద్వారా కరోనా వ్యాపించినట్లు గుర్తించారు. తబ్లీగీ జమాతే కార్యాలయంలో తనిఖీలు చేసిన ఢిల్లీ పోలీసులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Tablighi Jamaat Chief Maulana Saad Arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News