Monday, April 29, 2024

ఇంగ్లీష్ విద్య తప్పని ‘సరి’ కాదు.. జీవొ కొట్టేసిన ఎపి హైకోర్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ సిఎం జగన్ ప్రభుత్వం జారీ చేసిన జివొ 81, జివొ 85లను బుధవారం నాడు ఎపి హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వం జారీ చేసిన రెండు జివొలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వెలువరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఇంద్రనీల్ వాదిస్తూ విద్యార్థులు ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులే తీసుకుంటారని కోర్టుకు విన్నవించారు. ఇంగ్లీష్ మీడియం వల్ల బ్యాక్ లాగ్లు పెరిగిపోతాయని తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇటీవల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. బుధవారం నాడు తుది తీర్పును వెలువరిస్తూ 81, 85 జీవోలను కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

AP High Court Cancelled English Medium GO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News