Monday, April 29, 2024

తెలంగాణలో కరోనా హాట్‌స్పాట్ జిల్లాలు ఇవే

- Advertisement -
- Advertisement -

Corona Hotspot

 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడి కోసం దేశంలోని జిల్లాలను మూడు భాగాలుగా విభజించింది కేంద్ర వైద్యారోగ్య శాఖ. ఎక్కువ కరోనా కేసులున్న జిల్లాలను హాట్‌స్పాట్‌(రెడ్‌జోన్) తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాన్ని నాన్ హాట్‌స్పాట్స్‌‌గా విభజించారు. ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు నమోదుకాని జిల్లాలను గ్రీన్ జోన్‌లుగా పేర్కొంటారు. ఐతే దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్ జిల్లాలు, 207 నాన్ హాట్ స్పాట్ జిల్లాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ హాట్ స్పాట్ లిస్ట్‌ను విడుదల చేసింది

తెలంగాణలో కరోనానా హాట్‌స్పాట్ జిల్లాలు:
హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిర్మల్. ఈ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో కేసులు నమోదయ్యాయి.

నల్గొండ కరోనా క్లస్టర్స్ కలిగిన హాట్‌స్పాట్ జిల్లాగా పేర్కొంది కేంద్రం.

తెలంగాణలో నాన్‌ హాట్ స్పాట్స్ జిల్లాలు:
సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీమ్ అసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,

ప్రస్తుతం హాట్‌స్పాట్‌గా ఉన్న జిల్లాల్లో మరో 14 రోజుల్లో ఎలాంటి కేసులు నమోదైతే వాటిని ఆరెంజ్ జోన్‌లో జాబితాలో చేర్చుతారు. ఆరెంజ్ జోన్లోకి వచ్చిన తర్వాత మరో 14 రోజుల్లో ఎలాంటి కేసులు నమోదు కాకుంటే గ్రీన్ జోన్‌గా పరిగణిస్తారు. అంటే 28 రోజుల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదుకాకుంటే ప్రస్తుతం హాట్‌స్పాట్ జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలోకి వెళ్తాయని కేంద్రం తెలిపింది.

Corona Hotspot districts in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News