Monday, April 29, 2024

తాజ్ హోటల్ పునః సృష్టి

- Advertisement -
- Advertisement -

Taj Hotel re-creation for Major movie

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మేజర్’. ఈ చిత్రాన్ని మహేష్‌బాబు జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా నిర్మిస్తోంది. 26/11 ముంబయ్ నగరంలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు అడివి శేష్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. యదార్థ సంఘటల ఆధారంగా దర్శకుడు శశి కిరణ్ ఈ స్క్రిప్ట్‌ను తయారు చేసుకున్నారు. అందుకు తగినట్లు భారీ సెట్స్‌ను వేసి సినిమాను చిత్రీకరిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ‘మహానటి’తో పాటు ఎన్నో చిత్రాల కోసం పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ‘మేజర్’ చిత్రం కోసం ఆరు సెట్లను నిర్మించారు.

వీటిలో ఒకటి గేట్ వే ఆఫ్ ఇండియా, మరొకటి ఎన్.ఎస్.జి కమాండోస్ సెటప్ కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో వీటిని నిర్మించారు. 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు దాడి చేసిన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సెట్ ని కూడా ఆయన నిర్మించారు. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ వచ్చాక.. ఈ సినిమా కథాంశం సహా మేకింగ్ గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. ‘మేజర్’కి తాజ్ హోటల్ చాలా ముఖ్యం. అయితే హోటల్ వద్ద షూట్ చేయడానికి అనుమతి ఇవ్వనందున సెట్ అవసరమైంది. ఈ సెట్‌ను నిర్మించడానికి 500 మంది 10 రోజులకు పైగా పనిచేశారు. తాజ్ హోటల్ కొలతలు తీసుకునేందుకు నిర్మాణాలను గమనించడానికి అవినాష్ కొల్ల, అతని బృందం సభ్యులు హోటల్‌లో నాలుగు రోజులు గడిపారు. ఈ సందర్భంగా అవినాష్ కొల్ల మాట్లాడుతూ “తాజ్ హోటల్ సెట్ ప్రామాణికమైనదిగా కనిపించాలని మేము కోరుకున్నాం. గ్రాండ్ మెట్ల రూపం.. టాటా విగ్రహం .. ఎం.ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్ కూడా ఈ సెట్లో ఉన్నాయి. హుస్సేన్ చిత్రాలను పునః సృష్టి చేశాం. హోటల్ ఐదు అంతస్తులకు తగ్గట్టు 120 అడుగుల ఎత్తైన భవనాన్ని నిర్మించడానికి ఎంతో శ్రమించాము”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News