Monday, April 29, 2024

చిరుకు జోడీగా మిల్కీబ్యూటీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ‘భోళాశంకర్’. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ‘భోళాశంకర్’ మూవీ కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది.ఈ నెల 11న ‘భోళాశంకర్’ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా మహానటి కీర్తి సురేశ్ నటిస్తుంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన యాక్షన్ డ్రామాగా ‘భోళాశంకర్’ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు  మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్  సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో ప్రత్యేక పాత్రలో తమన్నా నటించిన విషయం తెలిసిందే.

Tamannaah romance with Chiranjeevi in ‘Bhola Shankar’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News