Saturday, April 27, 2024

కరోనాకు విరుగుడుగా టిబి, పోలియో వ్యాక్సిన్లు

- Advertisement -
- Advertisement -

TB and polio vaccine as antidote to corona

 

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన

వాషింగ్టన్: ప్రాణాంతక కోరోనా వైరస్ నుంచి కాపాడేందుకు టిబి, పోలియో వ్యాక్సిన్లను ఉపయోగించే సాధ్యాసాధ్యాలను అమెరికను శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. కరోనా వైరస్‌కు విరుగుడుగా టిబి వ్యాక్సిన్‌ను ఉపయోగించడంపై ప్రస్తుతం ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు టిబి వ్యాక్సిన్ ఒక్కటే ప్రపంచమంతటా వినియోగిస్తున్నారని టెక్సాస్ ఎ అండ్ ఎం హెల్త్ సెంటర్‌కు చెందిన మైక్రోబయల్ ప్రొఫెసర్ జెఫ్రీ డి సిరిల్లో తెలిపారు. బసిల్లస్ కాల్మెట్ గిరిన్(బిసిజి)గా వ్యవహరించే టిబి వ్యాక్సిన్‌పై పరీక్షలు జరుగుతున్నాయని డాక్టర్ సిరిల్లో తెలిపారు. బిసిజి వ్యాక్సిన్‌కు ఎఫ్‌డిఎ అనుమతి ఇదివరకే ఉందని, సురక్షితమైన వ్యాక్సిన్‌గా బిసిజికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా.. మరికొందరు శాస్త్రవేత్తలు కరోనా నిరోధానికి పోలియో వ్యాక్సిన్ ఉపయోగడే విషయమై పరిశోధనలు జరుపుతున్నారు. మనిషిలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో టిబి, పోలియో వ్యాక్సిన్లు దోహదపడతాయని, కరోనా వైరస్‌తో సహా ఇతర వైరస్‌లను అంతం చేయడానికి నిరోధక శక్తి అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News