Monday, April 29, 2024

ఈ సింగ్… పోటీ చేయడంలో కింగ్!

- Advertisement -
- Advertisement -

భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఫలితం గురించి ఆలోచించకు అనేకదా. ఆ పనే చేస్తున్నాడు తీతార్ సింగ్. రాజస్థాన్ కు చెందిన 78 ఏళ్ల ఈ పెద్దాయన గత యాభైయ్యేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడు. ఫలితం కోసం చూడకుండా, ఎప్పుడు ఎన్నికలొచ్చినా నామినేషన్ వేస్తూ ఉంటాడు. గెలవడం మాట అటుంచి, డిపాజిట్ రాకపోయినా ఏమీ పట్టించుకోడు. తీతార్ సింగ్ ఇప్పటివరకూ 20 ఎన్నికల్లో పోటీ చేసినా, ఏనాడూ డిపాజిట్ కూడా దక్కలేదు.

దళితవర్గానికి చెందిన తీతార్ కు పెద్దగా ఆస్తిపాస్తులేవీ లేవు. రోజు కూలీగా పని చేసే తీతార్, ఎన్నికల నగారా మోగిందంటే చాలు, నానా యాతనా పడి డిపాజిట్ డబ్బు కూడబెట్టి, ఎన్నికల బరిలోకి దిగుతాడు. గెలవనప్పుడు పోటీ చేయడమెందుకని అడిగితే, ఓ నవ్వు నవ్వి  ‘ఏం, నేను పోటీ చేయకూడదా?‘ అని ఎదురు ప్రశ్నిస్తాడు. తాను పోటీ చేసేది ప్రచారం కోసం కాదనీ, పేదవర్గాలకు భూమి, ఇతర సౌకర్యాల సాధన కోసమని చెబుతాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన తీతార్ కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మనవలకి కూడా పెళ్ళిళ్లయిపోయాయి.

పంచాయతీ ఎన్నికలు మొదలుకుని లోక్ సభ ఎన్నికల వరకూ ప్రతి ఎన్నికలలోనూ నామినేషన్ వేస్తూ ఉంటాడు. రాజస్థాన్ అసెంబ్లీకి 2008లో జరిగిన ఎన్నికల్లో 938 ఓట్లు, 2013లో 427 ఓట్లు, 2018లో 653 ఓట్లు వచ్చాయి. రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న జరిగే ఎన్నికల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగాడు. కరణ్ పూర్ నియోజకవర్గంనుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News