Thursday, May 16, 2024

అందుకే ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నా

- Advertisement -
- Advertisement -

Tejasvi comments on Casting Couch

 

కాస్టింగ్ కౌచ్‌పై మరో యంగ్ హీరోయిన్ నోరు విప్పింది. కాస్టింగ్ కౌచ్‌పై మొన్నటివరకు నర్మగర్బంగా మాట్లాడిన హీరోయిన్ తేజస్వి… ఈసారి దాని గురించి మరింత విపులంగా చెప్పుకొచ్చింది. తనను చాలామంది కమిట్‌మెంట్ అడిగారని బయటపెట్టింది తేజస్వి. “సినిమా ఇండస్ట్రీలో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉంది. దాన్ని దాటి వెళ్లిన తర్వాతే అసలైన ఇండస్ట్రీ మనుషులుంటారు. అసలైన గుర్తింపు కూడా వస్తుంది. నేను కూడా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. నన్ను కమిట్‌మెంట్ అడిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే నేను ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. ధైర్యంగా మాట్లాడతాను కాబట్టి ఎక్కువమంది నాతో పెట్టుకోలేకపోయారు”అని చెప్పింది తేజస్వి.

అయితే తనకు తెలిసిన హీరోయిన్లు చాలామందికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయని.. చాలామంది సిగ్గుపడి బయటకు చెప్పడం లేదని పేర్కొంది ఈ భామ. మరోవైపు ముంబయ్ హీరోయిన్లపై కూడా ఉన్నదున్నట్టు మాట్లాడేసింది. “ముంబయ్ హీరోయిన్లను ఎందుకు తెచ్చుకుంటారంటే… వాళ్లకు కాస్టింగ్ కౌచ్ గురించి అంతా తెలుసు. 90 శాతం ముంబయి అమ్మాయిలు దీనికి ముందుగా సిద్ధమై వస్తారు. ఈ విషయం తెలుగు అమ్మాయిలకు తెలుసు, తమిళ అమ్మాయిలకు కూడా తెలుసు. ఎటొచ్చి మనం దీనికి మానసికంగా సిద్ధమై ఉన్నామా లేదా అనేది పాయింట్. కమిట్‌మెంట్‌కు రెడీ అంటే అవకాశం ఇచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు”అని చెప్పింది తేజస్వి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News