Sunday, April 28, 2024

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్లు: కేబినెట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందులో భాంగంగానే మహిళల కోసం అనేక సంక్షేమా పథకాలను తీసుకొస్తున్నామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్రమంత్రి వర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. అనంతరం మీడియా ద్వారా కేబినేట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలను  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వివరించారు.

మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటికే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నామన్నారు. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్ల ఏర్పాటు చేస్తామా తెలిపారు. ఇక, మహిళా సంఘాలకు రూ.10లక్షల వరకు బీమా ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News