Monday, April 29, 2024

హంద్రీ-నీవాకు నీరు ఆపండి

- Advertisement -
- Advertisement -

Telangana ENC Muralidhar Letter to KRMB over Handri neeva

అది అనధికార ప్రాజెక్టు కర్నూలు జిల్లాలోని హంద్రీ
నదికి, చిత్తూరు జిల్లాలోని నీవా నదికి శ్రీశైలం నుంచి
నీటి తరలింపు అక్రమం బేసిన్ బయటి ప్రాంతంలో ఉన్న
పెన్నాకు కృష్ణా జలాలను ఎలా తరలిస్తారు ఇది బచావత్
అవార్డుకు ఉల్లంఘన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు
వ్యతిరేకించాయి హంద్రీ-నీవాకు మరిన్ని జలాలను
తరలించుకుపోవాలని, కాలువ సామార్థాన్ని పెంచుతూ
ఏపి ఉత్తర్వులు కూడా జారీచేసింది కృష్ణరివర్
మేనేజ్‌మెంట్ బోర్డుకు తెలంగాణ ఇఎన్‌సి మురళీధర్ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వార శ్రీశైలం జలాశయం నుంచి తరలిస్తున్న కృష్ణాజలాలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు విజ్ణప్తి చేసింది. హంద్రీ-నీవా సుజల స్రవంతి పేరుతో నిర్మి ంచిన ఈ పథకం పూర్తిగా అనధికారిక ప్రాజెక్టు అని ఫిర్యాదు చేసింది. ఎపిలో కర్నూలు జిల్లా పరిధిలోని మాల్యాల నుంచి శ్రీశైలం రజర్వాయర్‌లోని కృష్ణానదీజలాలను తరించుకుపోతున్నారని బోర్డు దృష్టికి తీసుకుపోయింది. 1950 లో కేంద్ర ప్రభుత్వం, 1964లో ప్లానిం గ్ కమీషన్ శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుగానే అనుమతి ఇచ్చిందని, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మా ణం ద్వారా 264టిఎంసిల నీటిని రిజర్వాయర్‌లో నిలువ ఉంచి, దిగువన నాగార్జున సాగర్ జలాశయాన్ని నింపేందుకు అవసరాలకు తగ్గట్టుగా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని సాగర్‌కు విడుదల చేయాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం గా వెల్లడించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ శనివారం లే ఖ ద్వారా కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బో ర్డు దృష్టికి తీసుకుపోయారు.

ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌లో ఉండగానే హంద్రీనీ వా సుజల స్రవంతి పథకం ద్వారా శ్రీశై లం జలాశయం నుంచి 40టిఎంసిల కృష్ణానదీజలాలను తరలించుకుపోయే ందు కు ప్రాజెక్టును రూపకల్పన చేసి నిర్మించినట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లాలోని కుప్పం సమీపాన ఉన్న నీవా నదిలోకి కర్నూలు జిల్లాలోని హంద్రీనదిని కలపుతూ 760కిలోమీటర్ల మేరకు హంద్రీనీవా పథకాన్ని నిర్మించారని తెలిపారు. పెన్నా నదిని దాటి ఎంతో దూరాన ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణానదీజలాలు తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఒక నదీపరివాహక ప్రాంతం నుంచి మరో నదీపరివాహక ప్రాంతానికి నీటిని తరలించరాదని తెలిపారు. కృష్ణాబేసిన్‌కు బయటి ్రప్రాంతంలో ఉన్న పెన్నా బేసిన్‌కు కృష్ణాజలాలను ఏవిధంగా తరలిస్తారని ప్రశ్నించారు. ఇది బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును ఉల్లంఘించటమే అన్నారు. కృష్ణాబేసిన్ నుంచి బేసిన్ బయటి ప్రాంతాలకు కృష్ణానదీజలాలను తరలించుకుపోవటాన్ని ఎగువన ఉన్న మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయని తెలిపారు.

హంద్రీనీవా పథకం ద్వారా మరింత అధికంగా కృష్ణానదీజలాలను తరలించుకుపోయేందుకు ఎపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. మల్యాల నుంచి నీటిని తరలించేందుకు ఇదివరకు 3850క్యూసెక్కుల సామర్ధం మేరకు మాత్రమే ప్రధాన కాలువ నిర్మించారని ,అయితే ఇప్పడు ఈ కాలువ ద్వారా 6300క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయేందుకు హంద్రీనీవా పథకం కాలువ సామర్ధాన్ని పెంచుతూ అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఎపి ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2021మేనెల 26న ఇదే విషయాన్ని తెలియజేస్తూ బోర్డుకు, కేంద్రానికి కూడా లేఖ రాసినట్టు ఈఎన్సీ పేర్కొన్నారు. అనధికారికంగా నిర్మించిన హంద్రీనీవా పథకం ద్వారా 3850క్యూసెక్కుల కృష్ణాజలాల తరలింపే అక్రమం అని చెబుతుంటే, మళ్లీ కాలువ సామర్ధం మరింత పెంచుతూ పనులు చేపట్టడం మరింత అక్రమం అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి తుంగభద్ర హైలెవల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్‌కు వెలుపలకు నీటిని తరలిస్తున్నందున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తు చేశారు.

వరద జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని, ఎపి ప్రభుత్వం మాత్రం విజప్తి చేయడ లేదన్నారు. వీటిన్నింటి నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటివాటాలు చేసేవరకూ హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కృష్ణానదీజలాలను తరలించకుండా ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News