Monday, April 29, 2024

వాయిదా వేయండి

- Advertisement -
- Advertisement -
Telangana Need Equal Share of Water Says Rajat Kumar
కృష్ణ నదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసిన రజత్‌కుమార్
జల విద్యుత్ కేంద్రాలను
బోర్డుకు అప్పగించం ప్రాజెక్టుల
యాజమాన్య హక్కులు రాష్ట్రానివే
బోర్డు నుంచి ప్రతిపాదన
వచ్చాకే అప్పగింత నిర్ణయం
కృష్ణ నీటిలో 50%వాటా
కోరుతున్నాం
నదీ పరీవాహక ప్రాంతం
తెలంగాణలోనే ఎక్కువ ఉంది
అదనంగా 150టిఎంసిల
నీటిని ఇవ్వాలి నెట్టెంపాడు,
భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి
ప్రాజెక్టులకు నికర జలాలు
కేటాయించాలి

మనతెలంగాణ/ హైదరాబాద్: కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగి తెలంగాణ , ఎపి మధ్య కృష్ణానదిలో నీటివాటాలు తేల్చేదాక గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపివేయాలని కృష్ణానదీయాజమాన్య బోర్డును కోరినట్టు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం జలసౌధలో జరిగిన కృష్ణానదీయాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం అనంతరం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బోర్డు కోరుతున్న విధంగా శ్రీశైలం , నాగార్జున సాగర్ జలవిద్యుత్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించలేమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జలవిద్యుత్ అత్యంత ప్రాధాన్యం అని సమావేశంలో బోర్డుకు మరోమారు స్పష్టం చేశామన్నారు.కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో నీటిని విడుదల చేసే 65కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్‌లో పెట్టారని తెలిపారు. వాటిలో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 12 ,నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో 18 నీటివిడుదల కేంద్రాలను అప్పగించాలని బోర్డు ప్రతిపాదించిందని వివరించారు.

జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని అంధ్రప్రదేశ్ కోరగా ,అందుకు తాము అభ్యంతరం తెలిపామన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి తెలంగాణ రాష్ట్రం నిబంధనలకు లోబడే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుందని ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని బోర్డుకు తెలిపామన్నారు. పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ ద్వారా నిబంధనలకు విరుద్దంగా నీటిని ఉపయోగించుకుంటున్న ఎపి ఇంకా అదే అలవాటుగా మార్చుకుందన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే వాటి యాజమాన్య హక్కులు ఎవరివన్న అంశంలో న్యాయపరమైన సలహాలు తీసుకున్నామన్నారు. ప్రాజెక్టులపై తీసుకున్న రుణాలు వంటివి వాటి యజమానికే సంబంధం అన్నారు. ప్రాజెక్టులపైన బోర్డుకు నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే ఉంటాయని , ప్రాజెక్టుల యాజమాన్య హక్కుల పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని న్యాయనిపుణులు వివరించారని తెలిపారు. జలవిద్యుత్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని లేఖ రాస్తే ఆందుకు తాము అంగీకరించేది లేదన్నారు.

ఎపి పరిధిలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ , హంద్రీ-నీవా ప్రాజెక్టలను కూడా బోర్డు పరిధిలొకి తీసుకోవాలని కోరామన్నారు. దశలవారీగా అన్నింటి అప్పగింతకు ప్రతిపాదనలు ఇస్తామని తెలిపారన్నారు.సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు ఏ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకునేది బోర్డు అధికారికంగా ప్రతిపాదనలు ఇస్తే తాము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ,దాన్ని పరిశీలించి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాకే ఆ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. సీడ్‌మని కింద రూ.200కోట్లకు సంబంధించి కూడా దేని కి ఎంత ఖర్చు చేస్తారు. వినిమయపు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని బోర్డు చైర్మన్‌ను కోరామన్నారు.

కృష్ణా 50శాతం వాటా కోరుతున్నాం

బోర్డు సమావేశం ప్రారంభానికి కూడా రజత్ కుమార్ మీడియా తో మాట్లాడారు. కృష్ణానదీజలాల్లో 50శాతం వాటా కోరుతన్నామని తెలిపారు. కృష్ణాజలాలలో తెలంగాణ రాష్ట్రం వాటా పెరగాలన్నారు. నదీపరివాహక ప్రాంతం కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉందని తెలిపారు. కొ త్త ట్రిబ్యునల్ వచ్చేదాకా మరో 105టిఎంసీల నీటిని రాష్ట్రానికి అదనంగా ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నెట్టెంపాడు,బీమా , కోయిల్ సాగర్, ల్వకుర్తి ప్రాజెక్టులకు నికరజలాలను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వాటా ప్రకారం 570టిఎంసిల నీటిని కేటాయించాలనే అంశంపై చర్చలు జరగుతున్నాయని తెలిపారు. బోర్డు పరిధిలోకి విద్యుత్ ప్రాజెక్టులు సైతం ఉండాలని కోరుతున్నారని , తెలంగాణలో అన్ని ఎత్తిపోతల పథకాలే ఉన్నాయన్నారు. రాష్ట్రానికి నీటి టు విద్యుత్ ఉత్పత్తి కూడా అన్నారు. ఎత్తిపోతల పథకాలు, వ్య వసాయ ఉన్నందున అవసరం ఉన్నప్పుడు విద్యుత్ ఉ త్పత్తి చేయాల్సివుంటుందని తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టాలు నిర్ఱయించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుందని నీటిపారుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News