Monday, April 29, 2024

తెలంగాణ ఎస్‌ఐ తుది ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఎస్‌ఐ, ఎఎస్‌ఐ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. మొత్తం 587 పోస్టులకు గానూ 434 పురుష అభ్యర్థులు, 153 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) ఎంపిక జాబితా విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కట్ ఆఫ్ మార్కుల వివరాలు సోమవారం ఉదయం పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని బోర్టు వెల్లడించింది. కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు తాజాగా తుది ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాగా 587 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి గానూ గతేడాది టిఎస్‌ఎల్‌పిఆర్‌బి2022 నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు 2.47 లక్షల మంది అభ్యర్ధులు ఆగస్టు 7న ప్రిలిమినరీ పరీక్ష రాశారు.

ఎస్‌ఐ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష తర్వాత తుదపరి దశలైన మెయిన్స్, దేహదారుఢ్య పరీక్షలన్నింటినీ బోర్డు నిర్వహించింది. తాజాగా ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్, ఇతర ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో ఆగష్టు 9 నుంచి ఆగష్టు 11 వరకు ఆన్‌లైన్‌లో పూర్తించవల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థుల ప్రవర్తన, క్రిమినల్ కేసులపై బోర్డు పది రోజులపాటు ఆరా తీయనుంది. అందుకు స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బి) విభాగంతో ఒక్కో అభ్యర్ధి గురించి విచారణ జరిపించనుంది. క్లీన్ చీట్ ఉన్న వారికి ఎంపిక లేఖలు బోర్డు జారీ చేస్తుంది. ఆగస్టు రెండో వారం లోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు ఇలా అన్ని విభాగాలకు పంపించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయితే ఎస్త్స్ర పోస్టులకు అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేస్తుంది. ఇక పోలీస్ కానిస్టేబుల్ తుది ఎంపిక ఫలితాలు ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదు. కంటీజియస్ జిల్లా కేడర్ పరిధిలోని కానిస్టేబుల్ పోస్టులపై హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే ఎంపిక ఫలితాలు విడుదల కానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News