Sunday, April 28, 2024

కరోనా కట్టడిలో తెలంగాణ టాప్

- Advertisement -
- Advertisement -

Corona control

 

తెలంగాణలో 70 రోజులకు కేసుల రెట్టింపు
ఎన్‌టిడివి విశ్లేషణలో వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రముఖ జాతీయ ఛానెల్ అయిన ఎన్‌డిటివి పేర్కొన్నది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని వ్యాఖ్యానించింది. వివిధ రాష్ట్రాల్లో రెట్టింపు కేసుల సంఖ్యపై ఎన్‌డిటివి విశ్లేషించింది. దీని ప్రకారం తెలంగాణతో పాటు ఛత్తీస్‌ఘడ్‌లో గరిష్టంగా 70 రోజులకు కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నట్లు పేర్కొంది. వైరస్‌ను కట్టడి చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు కంటైన్మెంట్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంతోనే ఇది సాధ్యమైనట్లు వైద్యాధికారులు తెలిపారు.

కరోనా పట్ల ప్రజలను కూడా పెద్ద ఎత్తున చైతన్య తీసుకువచ్చింది. వీటి కారణంగానే రాష్ట్రంలో కరోనాను చాలా త్వరగా నియంత్రించ గలిగిందని కితాబిచ్చింది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ 19 కేసులు రెట్టింపు కావడంపై చేసిన విశ్లేషణ ఇలా ఉంది. జార్ఖండ్ ప్రతి ఆరు రోజులు, బిహార్‌లో ప్రతి ఐదు రోజులు, ఒడిస్సా, ఢిల్లీలో ప్రతి 10 రోజులు. జమ్మూ అండ్ కశ్మీర్ 12 రోజులు, ఉత్తర్‌ప్రదేశ్, హార్యానా 25 రోజులు, మధ్య ప్రదేశ్ 20 రోజులు, కర్ణాటక, కేరళ, పంజాబ్ 35 రోజులు, చత్తీస్‌ఘడ్ 70 రోజులు, తెలంగాణలో 70 రోజులకోసారి రెట్టింపు అవుతున్నట్లు తెలిపింది.

 

Telangana top place in Corona control
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News