Monday, April 29, 2024

మే 8 వరకల్లా కరోనా ఫ్రీ

- Advertisement -
- Advertisement -

etela

 

ఐసిఎంఆర్ నిబంధనల మేరకే టెస్టులు చేస్తున్నాం
కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌లో పడిపోయింది
3 నుంచి 5 వేల టెస్టులు చేసే మిషన్ ఆర్డర్ ఇచ్చాం
కొత్తగా ఆరు కేసులు నమోదు, 42 మంది డిశ్చార్జ్
1009కి చేరిన పాజిటివ్‌ల సంఖ్య : ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే 8 వరకు కరోనా అంతమయ్యే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గత వారం రోజులుగా కేసులు సంఖ్య సింగిల్ డిజిట్‌కి పడిపోయాయని, లాక్‌డౌన్‌ను సమర్ధవంతంగా నిర్వర్తించడం వలనే ఇది సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం కో ఠి కమాండ్ కంట్రోల్ రూంలో వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ ‘రాష్ట్రంలో కొత్తగా ఆరు కేసులు నమోదుకాగా, 42 మంది డి శ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1009కి చే రుకుంది.

గాంధీ, కింగ్‌కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 610 మంది కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు పూర్తిగా కోలుకొని వేర్వేరు ఆసుపత్రుల నుంచి 374 మంది డి శ్చార్జ్ అయ్యారు. కొవిడ్ రోగులకు 14 రోజుల పాటు చికిత్స అనంత రం రెండు టెస్టులు నెగటివ్ వస్తేనే డిశ్చార్జ్ చేస్తున్నాం. ఈనెల 21వ తేదిన రాష్ట్రంలో కేసుల సంఖ్య సిం గిల్ డిజిట్ పడిపోయింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 50 శాతం జిహెచ్‌ఎంసి పరిధిలో నమోదుకాగా, ఆ తర్వాత వికారాబాద్, గద్వాల, సూర్యపేట్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అన్నిశాఖల అధికారుల రివ్యూ అనంతరం సోమవారం సిఎం 22 జిల్లాలను కరోనా ఫ్రీగా ప్రకటించారని’మంత్రి అన్నారు.

ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనాపై పోరాడుతోంది..
‘రాష్ట్రంలో సిఎంతో పాటు ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనాపై పోరాడుతుంది. ప్రతి రోజూ సిఎం ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కరోనా కులకుశంగా చర్చిస్తూ కట్టడి నిర్ణయాలు చేపడుతున్నాం. అన్ని జిల్లాల మంత్రులతో, అధికారులతో మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్నాం. మే 7 వరకు తు.చ తప్పకుండా లాక్‌డౌన్ అమలవుతోంది. తెలంగాణ కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వనరులున్నా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, వంటి దేశాలే అల్లాడిపోతుండగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక వూహాంతో ముందుకు వెళ్తుంది. కొవిడ్‌పై పోరాడుతున్న వారికి యావత్ ప్రజనీకం సలామ్ కొపడుతుందని’ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ఐసిఎంఆర్ నిబంధనల మేరకే టెస్టులు చేస్తున్నాం..
ఐసిఎంఆర్( ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనల మేరకు టెస్టులు చేస్తున్నాం. ఎవరికి పడితే వారికి టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. ప్రైమరీ కాంటాక్ట్‌లతో పాటు , కొవిడ్ పాజిటివ్ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా పరీక్షలు చేస్తున్నాం. టెస్టులు, కేసుల నమోదు విషయంలో గొప్యత లేదు. కరోనా విషయంలో చాలా పారదర్శకతతో పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు 19వేల మందికి పైగా పరీక్షలు చేశాం. మొత్తం 9 ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నాం. దీంతో పాటు ప్రతి రోజూ మరో 3వేల నుంచి 5వేల మందికి పరీక్షలు చేసేందుకు కొత్త మిషన్‌ను ఆర్డర్ చేశాం. మరో నెల రోజుల్లో అది అందుబాటులోకి వస్తుంది. ర్యాండమ్ పరీక్షలు తెలంగాణలో అవసరం లేదని కేంద్రం స్వయంగా చెప్పింది.

ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా మరణాలశాతం కేవలం 2.5గా మాత్రమే ఉంది. కేంద్ర బృందాలు కూడా హైదరాబాద్‌లో పర్యటించి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. లక్షణాలు లేకుండా స్వాప్‌లో లో సరైన శాంపిల్ రాదు. విదేశీయులు, మర్కజ్ లింక్‌లో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాము. మరణాల్లో కూడా రెండు గుల్బర్గ, ఒకటి ఎపికి చెందిన వారు ఉన్నప్పటికీ, వారు ఇక్కడి అడ్రస్‌తో అడ్మిట్ అవడం వలన తెలంగాణ కరోనా మరణాలుగా ప్రకటించాము. ప్రతి రోజూ ప్రస్తుతం 1540 మందికి టెస్టులు చేసే కెపాసిటీ ఉందని’ మంత్రి తెలిపారు.

కంటైన్‌మెంట్లతోనే కరోనా వ్యాప్తిని అడ్డుకున్నాం..
‘రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కంటైన్‌మెంట్లతోనే అడ్డుకోగలిగాం. కరీంనగర్ వ్యూహాం అద్బుతంగా పనిచేసింది. 50 రోజులుగా వైద్య సిబ్బందికి నిద్రలు లేవు. ప్రస్తుతం తెలంగాణలో వైరస్ తగ్గుముఖం పట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి కరోనా కంట్రోల్ తప్పా, ప్రస్తుతం మరో ధ్యాస లేదు. దీంతో పాటు ప్రతి ఒక్కరికి కడుపు నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్ర ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం పాజిటివ్ వచ్చినా, హో క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందవచ్చని ఉంది. కానీ మేము ప్రస్తుతం అనుమతించే పరిస్థితి లేదు. బాధ్యత గల వారు కరోనాపై వదంతులు సృష్టించకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని’ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

 

Corona to end May 8 in Telangana state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News