Monday, April 29, 2024

హైడ్రామా: ఆరూరిని బలవంతంగా కారులో తీసుకెళ్లిన ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. బిజేపీలో చేరేందుకు నిర్ణయించుకుని, ప్రెస్ మీట్ పెట్టిన ఆరూరిని బిఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ సారయ్య తమ కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిపోవడంతో ఆరూరి అనుచరులు నిశ్చేష్టులయ్యారు.

ఆరూరి బిజేపీలో చేరతారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. వీటిని నిజం చేస్తూ మంగళవారం ఆయన హైదరాబాద్ లో అమిత్ షాను కలుసుకుని, పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈమేరకు తాను పార్టీలో చేరుతున్న విషయాన్ని ప్రెస్ కు చెప్పేందుకు బుధవారం ఉదయం విలేఖరులను ఆహ్వానించారు. మరికాసేపట్లో ప్రెస్ మీట్ మొదలవుతుందనగా, ఎర్రబెల్లి, సారయ్య రంగంలోకి దిగారు. పార్టీలోనే ఉండాలంటూ ఆరూరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆరూరి ససేమిరా అనడంతో ఆయనను తమతోపాటు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆరూరి అనుచరులు వారి కారుకు అడ్డంపడ్డారు. కొంతసేపు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువైపులా పోటాపోటీ నినాదాలు కొనసాగాయి. చివరకు ఆరూరితో సహా ఎర్రబెల్లి, సారయ్య సంఘటన స్థలంనుంచి నిష్క్రమించారు.

ఆరూరిని జనగామలో ఉన్న హరీశ్ రావు వద్దకు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరూరిని బుజ్జగించి పార్టీలోనే కొనసాగించే బాధ్యతను హరీశ్ రావు చేపట్టినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News