Monday, April 29, 2024

పుదుకొట్టైలో ఉద్రిక్తత…జల్లికట్టుకు నిరాకరించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

 

తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో భాగంగా జల్లికట్టును నిర్వహిస్తుంటారు. ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట .ఇది స్పెయిన్లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్నా దీని విధానం వేరుగా ఉంటుంది. జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ రోజు దీనిని నిర్వహిస్తారు. మదురైకి దగ్గరలో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే పోటీలు ప్రముఖమైనవి. దీన్నే మంజు విరాట్టు అని కూడా వ్యవహరిస్తారు. మంజు విరాట్టు అనగా ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం. అయితే ఈ ఆటకు రెండు సార్లు పోలీసులు అనుమతించ లేదు. ఈసారి కూడా జల్లికట్టుకు అనుమతి నిరాకరించడంతో పుదుకొట్టైలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News