Monday, April 29, 2024

పులి కోసం బోను సిద్ధం

- Advertisement -
- Advertisement -

పులి బయటకు వస్తుందన్న కెటిఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ కౌంటర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కెటిఆర్‌కు సిఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. పులి బయటకు వస్తే బోనులో వేసి బందిస్తానని, వలపెట్టి వేలాడదీస్తామని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ చూద్దామన్నా కనిపించదని, 100 మీటర్ల గొయ్యితీసి ఆ పార్టీని పాతిపెడతామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఓడిపోయినా కెటిఆర్‌లో అహంకారం తగ్గలేదని ఆయన ఆరోపించారు. ఎంఎల్‌సి ఎన్నిక విషయంలోనే బిఆర్‌ఎస్ నేతలు బొక్కబోర్లా పడ్డారని, అయినా బిఆర్‌ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని సిఎం రేవంత్ అన్నారు. వారి అహంకారం, గర్వం తగ్గించే బాధ్యత తనేదనని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మూసీ నదిని రాబోయే 36నెలల్లో ప్రక్షాళన చేస్తామని, థేమ్స్ నదిలో పారుతున్నట్లుగా స్వచ్ఛమైన జలాలను పారిస్తామని తెలిపారు. జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఓటమిపాలైన తరువాత వారికి భయం పట్టుకుందని అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మూడు రోజుల్లో తెలంగాణ గడ్డపై తాను అడుగు పెట్టబోతున్నానని ఆరోజు మీ సం గతి చెబుతానని రేవంత్ బిఆర్‌ఎస్ నాయకులను హెచ్చరించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయంలో రాష్ట్ర అభివృద్ధి ఆలోచనతోనే ఉంటామని రేవంత్ పేర్కొన్నారు.

రాష్ట్రాభివృద్ధి, సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతుంటే బిఆర్‌ఎస్ నాయకులు కెటిఆర్, హరీష్‌రావులు ఓర్వలేక పోతున్నారని ఆయ న మండిపడ్డారు. మీలాగా నేను తండ్రి పేరుతో మంత్రి అయి విలాస వంతమైన జీవితం గడిపేందుకు విదేశాలకు రాలేదని, రాష్ట్ర అభివృద్ధి  కోసమే ఇక్కడకు వచ్చానని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ తరువాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయబోతున్నట్టు సిఎం ప్రకటించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకు రావడంలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు, కాంగ్రెస్ అభిమానులతో రేవంత్ భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News