Friday, May 17, 2024

రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -
  • బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యయాదవ్

ఫరూఖ్‌నగర్: రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్షం అని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో షాద్‌నగర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీ నెల్లి శ్రీవర్థన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేండ్ల పాలనలో రైతుల అభ్యున్నతికి విశేష కృషి శారని, సబ్సిడీ ద్వారా ఎరువులు అందించడంతో పాటు పంట మద్దతు ధరలను అందించారని అన్నారు.

ప్రతి రైతుకి కేంద్రం పంట సాగు కోసం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. రైతు ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కొనియాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదని, ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని చెప్పి విస్మరించారని, ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. రుణమాఫీ చేస్తారని గంపెడు ఆశలతో రుణాలను చెల్లించని రైతులకు వడ్డీ భారం అధికమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్‌ని ప్రజలు నమ్మరని ఇక బిఆర్‌ఎస్ తుడిచి పెట్టుకుపోతుందని అన్నారు.

నరేంద్రమోదీ సుపరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, మరోసారి బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడంతోపాటు రాష్ట్రంలోనూ బిజెపి జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్‌రెడ్డి, నేతలు విజయ్‌కుమార్, అశోక్‌గౌడ్, మిథున్‌రెడ్డి, వంశీకృష్ణ, రవీదర్‌రెడ్డి, రాంరెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, వెంకటేష్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News