Monday, April 29, 2024

అంజయ్యనగర్ స్మశాన వాటికలోని డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీకి మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్ కాలనీలో స్మశాన వాటికలోని డ్రైనేజీ సమస్యకు 22లక్షల రూపాయల అంచనావ్యయంతో చేట్టబోయే యుజిడి నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీకి మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కరంకు కృషి చేస్తామన్నారు.

అంజయ్యనగర్ స్మశాన వాటికలోపల ఉన్న ఎన్నో ఏండ్ల డ్రైనేజీ సమస్య నేటితో తిరుతుందన్నారు. డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం శరత్‌రెడ్డి, మేనేజర్ యాదయ్య, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బలరాం యాదవ్, నరసింహ సాగర్, షేక్ చాంద్‌పాషా, జంగంగౌడ్, తిరుపతిరెడ్డి, ప్రసాద్, గువ్వల రమేష్, తిరుపతి యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, హినాయత్, రవి శంకర్‌నాయక్, వెంకటి, వెంకట్‌రెడ్డి, బస్వరాజ్, రాజు, గణపతి, యాదయ్యగౌడ్, విజయ్‌కుమార్, సాగర్ చౌదరి, సాయి, శామ్యూల్ కుమార్, అబ్దుల్ కరీం, స్వామి సాగర్,సాయిబాబుసాగర్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News