Monday, April 29, 2024

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : దివ్యాంగుల సంక్షేమానికి ప్ర భుత్వం పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగుల కోసం పెంచిన రూ. 4016 పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో దివ్యాంగులకు రూ. 500లు ఇస్తే ఎక్కడ సరిపోని విధంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రూ. 1500 వరకు పెంచి వారికి తోడుగా నిలిచారని, రెండవ సారి ముఖ్యమంత్రిగా సిఎం కెసిఆర్ నియమితులైన తర్వాత రూ. 3016 పెంచి వారి జీవనానికి భరోసా కల్పించారని అ న్నారు.

అదే విధంగా మరో వెయ్యి పెంచుతూ వారికి రూ. 4016లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 3986 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. వారి కోసం అచ్చ ంపేట నియోజకవర్గంలో 150 బ్యాటరీ సైకిళ్లు దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. అదే విధంగా 450 గజాలలో దివ్యాంగులకు సంక్షేమ భవనం నిర్మిస్తామని, భవన నిర్మాణానికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు.

మా సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఎల్లవేళలా రుణపడి ఉం టామని దివ్యాంగులు తెలిపారు.రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహగౌడ్,ఎం పిపి శాంతాబాయి,లోక్య నాయక్, కౌన్సిలర్లు, ఆయా మండలా ల నాయకులు, ప్రజా ప్రతినిధులు, వికలాంగులు, సంఘం జి ల్లా అధ్యక్షుడు రాజశేఖర్,అధికారులు, దివ్యాంగులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News