Saturday, April 27, 2024

ప్రాజెక్టులు నిండాయి

- Advertisement -
- Advertisement -

projects

 

కాళేశ్వరం జలనిధుల నుంచి సాగుకు, దాహానికి నీళ్లివ్వండి

మనం కట్టుకున్న ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి
వానాకాలంలో వరద నీటి ప్రవాహం మరింతగా పెరుగుతుంది
ప్రాణహిత ద్వారా లక్ష్మీబ్యారేజీకి చేరే వరద నీటిని ఎప్పటికప్పుడు
ఎగువకు ఎత్తిపోయాలి, ఆ నీటిని కాలువలకు మళ్లించాలి, అందుకు
తగిన చర్యలు తీసుకోవాలి, అందుకు వీలుగా పనులు విభజించుకోవాలి
: ప్రగతిభవన్ సమీక్షలో అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసివీరవనిత, వనదేవత “సమ్మక్క” పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం బ్యారేజీకి “సమ్మక్క బ్యారేజీ”గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఇఎన్‌సిమురళీధర్ రావును సిఎం ఆదేశించారు. ముక్కోటి దే వతల కరుణా, కటాక్షాలు బలంగా వుండడం చేతనే తెలంగాణలో అభివృద్ది అనుకున్న రీతి లో సాగుతున్నదని సిఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యి తెలంగాణ బీళ్లల్లోకి కాళేశ్వరం సాగునీరు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సిఎం గుర్తు చేశారు.

కాగాగురువారం సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడు తూ, కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతి లో సాగునీరు చేరుకుంటున్నదన్నారు. ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారాయని తెలిపారు. రానున్న వానం కాలం నుంచి వరద నీటి ప్రవాహం మరింతగా పెరుగుతుందన్నారు. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అటునుంచి నీటిని కాలువలకు మళ్లించే దిశగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచి ంచారు. అందులో భాగంగా పనుల విభజన చేసుకోవాలని సిఎం తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గుంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రైతుసమన్వయ సమితి అధ్యక్షులు ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఒ కార్యదర్శి స్మితా సబర్వాల్, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ రావు దేశ్ పాండే, సాగునీటి శాఖ ఇఎన్‌సి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

తుపాకుల గూడెం బ్యారేజ్‌కు సమ్మక్క నామకరణం పై మంత్రి హర్షం
తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది పై నిర్మించే తుపాకుల గూడేం బ్యారేజ్‌కు సమ్మక్కగా సిఎం కెసిఆర్ నామకరణం చేయడం పట్ల రాష్ట్ర గిరిజ న, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అమ్మవారి పేరు నామకరణ చేయాలని నిర్ణయం తీసుకొ వడం ద్వారా రాష్ట్రం ప్రజల పై అమ్మవారి కటా క్షం సంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నారు. కా ళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనధారగా మార్చి న సిఎం కెసిఆర్, నేడు తుపాకుల గూడేం ప్రాజె క్టు పేరును ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్కగా నామకరణ చేయడం సముచితమైందన్నారు.

The projects are filled with full of water
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News