Monday, April 29, 2024

8 లక్షల మంది గ్యాస్ వినియోగదారులకు లబ్ధి

- Advertisement -
- Advertisement -

gas cylinders

 

ఉజ్వల పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ

మన తెలంగాణ/హైదరాబాద్ : దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు గ్యాస్ అందించేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రాష్ట్రంలో 8 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రం లో ఒక కోటి 25లక్షల మంది వినియోగదారులు ఉండగా వారిలో 6.4శాతం మంది మాత్రమే ఉజ్వల పథకం కింద నమోదైయ్యారు. గత 2016 నుంచి ప్రారంభమైన ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక చేసి బిపిఎల్ కుటుంబాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బలహీన వర్గాలకు చెందిన 8 లక్షల మందికి రాష్ట్రంలో ఉన్నారు. వీరికి ప్రతి కనెక్షన్ కోసం రూ.1600 ఆర్థిక మద్దతు ఈ పథకం ద్వారా అందించారు. తాజాగా మూడు సిలిండర్లు ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించడంతో 24లక్షల సిలిండర్లు ఉచితంగా రాష్ట్ర లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్రంలో రూ.216కోట్ల ప్రయోజనం కలిగినట్లయింది.

మూడు నెలల పాటు ఉచితం
రాష్ట్రంలో 87.59 లక్షల మందికి తెల్లరేషన్ కార్డులు ఉండగా, 2.83కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి తెల్లరేషన్ రేషన్ కార్డు కలిగిన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కేంద్రం 5 కేజీల బియ్యం చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. అంటే రాష్ట్రంలోని 2.83కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 1.41లక్షల టన్నుల బియ్యం ఇవ్వనున్నారు. ఇలా మూడనెలలకు 4.24లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫా 12కిలోల చొప్పున 3.39 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం కేటాయించిన బియ్యంతో రేషన్ లబ్ధిదారులకు 4.80లక్షల టన్నుల బియ్యం అందనున్నాయి. ప్రతి నెల కేటాయించే రేషన్‌లో కిలో బియ్యం రూ.30 కాగా రేషన్ అందించడానికి కేంద్రం రూ.27 సబ్సిడీ భరిస్తూ రూ.3లకు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దానిలో రూ.2 భరించి రేషన్ లబ్ధిదారులకు రూ.1కి అందిస్తోంది. తాజాగా ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన బియ్యం ఎలా అందిస్తారనేది తేలాల్సి ఉంది.

87.59లక్షల లబ్ధిదారులకు కిలో కందిపప్పు
కేంద్రం రేషన్ ద్వారా కిలో కందిపప్పు ప్రకటించింది. కార్డుకు కిలో చొప్పున 87.59లక్షల లబ్ధిదారులకు 8759 టన్నుల కందిప్పు అందించనుంది. ఇలా మూడు నెలల పాటు 26,277 టన్నుల కందిపప్పు అందించనున్నారు. టన్నుకు హోల్‌సేల్ రూ.80వేల చొప్పను ఖర్చు అవుతుండగా ఈ మూడు నెలల్లో రూ.210కోట్లు పేదలకు లబ్ధి చేకూరనుంది.

34.77 లక్షల మంది రైతులకు లబ్ధి
పిఎం కిసాన్ ద్వారా రాష్ట్రంలో లబ్ది పొందే రైతులు 34.77 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ కేంద్రం తాజాగా రూ.2000 ప్రకటించింది. అంటే తాజా కేటాయింపుల ద్వారా రాష్ట్రంలోని రైతాంగానికి రూ.695.40కోట్లు లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాలో నేరుగా నగదు బదిలీ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది.

 

Three gas cylinders free under Ujwal scheme
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News