Friday, May 17, 2024

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Three policemen were killed in Maoist firing

చత్తీస్‌గఢ్‌లో, నారాయణపూర్ జిల్లాలో
ఐటిబిపి పోలీసులపై దాడి
ఆయుధాలతో పరారీ ఐటిబిపి క్యాంపు
కార్యాలయం సమీపంలోనే ఘటన

మన తెలంగాణ/కొత్తగూడెం : చత్తీస్‌గఢ్‌లో కూంబింగ్‌లో ఉన్న ఐటిబిపి పోలీసులపై శుక్రవారం మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఐటిబిపి అసిస్టెంట్ కమాండెం ట్, ఒక ఎస్‌ఐ, మరో జవాను మృతిచెందారు. చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐటిబిటి పోలీసుల ఆయుధాలను సైతం ఎత్తుకెళ్లారు. నారాయణపూర్ జిల్లాలోని కడెమెట్ ఐటిబిపికి క్యాంప్‌నకు 600 మీటర్ల దూరంలో మాటువేసి, కూంబింగ్‌కు బయలు దేరిన 45 బెటాలియన్ పోలీసులపై దాడికి తెగబడ్డ మావోయిస్టులు దాడి అనంతంరం ఘటనా స్థలం నుంచి ఏకే —47, రెండు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, వాకీ టాకీ ఎత్తుకెళ్లారు. ఐటిబిపి క్యాంపునకు 600 మీటర్ల దూరంలో ఈసంఘటన చోటు చేసుకుంది.

ఈ దాడిలో అసిస్టెంట్ కమాండెంట్ సునీల్‌షిండే, ఎస్‌ఐ గురుముఖ్‌సింగ్‌లు మృతిచెందినట్లు బస్తర్‌రేంజ్ ఐజి సుందర్‌రాజ్ తెలిపారు. మరో కానిస్టేబుల్ మృతి ఇంకా ధృవపడలేదు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు తరలించారు. గత నెల 20వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో ఐటిబిపి జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో శివకుమార్ మణి అనే జవాను మృతి చెందాడు. మరో ఏఎస్‌ఐ గాయపడ్డారు. అక్కడి ఎమ్మెల్యే చందన్ కశ్యప్ పర్యటన సందర్భంగా ఆయన రక్షణ కోసం రోడ్డు ఓపెనింగ్ పార్టీ బలగాలపై అప్పట్లో దాడి దాడి జరిగింది. సరిగ్గా నెల తర్వాత ఇప్పుడు మావోయిస్టులు మరో దాడికి తెగబడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News