Monday, April 29, 2024

తెలంగాణలో నేడు ఉరుములతో కూడిన వర్షం

- Advertisement -
- Advertisement -

Thunder Showers rain in Telangana

హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. విదర్భ నుంచి కర్నాటక మీదగా ఉపరితల ఆవర్తనం నెలకొందని పేర్కొంది. దీంతో రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రైతులు ధాన్యాన్ని బయట ఆరబోయొద్దని అధికారులు హెచ్చిరించారు. ఇప్పటివకే తెలంగాణలో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో తెలం‌గా‌ణలో ఉరు‌ములు, మెరు‌పులు, ఈదు‌రు‌గా‌లు‌లతో కూడిన వానలు పడతాయని వాతా‌వ‌ర‌ణ‌శాఖ అధి‌కా‌రులు వెల్లడించారు.

Thunder Showers rain in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News