Monday, April 29, 2024

అసెంబ్లీ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన బందోబసు ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై ఉప్పల్ ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాల ఆదేశించారు. ఎన్నికల్లో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపై అధికారులు పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని, ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అధికారులకు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన డండాలని, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని అన్నారు. ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వలనరబుల్ పోలింగ్ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని, ఎన్నికల నిర్వహణ పరికరాలు తీసుకెళ్ళే రూట్ చెక్ చేసుకోవాలని అన్నారు. చెక్ పోస్ట్‌ల వద్ద ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అత్యవసరం ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటు ముందుగానే చూసుకోవాలని, ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో ఎదురైన సమస్యలు, ఇబ్బందులు సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఉంచాలని, రౌడీ షీటర్స్‌ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలని తెలిపారు.

ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, చిన్న విషయాలైన ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాల్లో విధిగా పర్యటిస్తూ ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో జాయింట్ సిపి అంబర్ కిషోర్ ఝ, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, రాచకొండ ట్రాఫిక్ డిసిపి 1 అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ దరావత్ జానకి, ఎస్‌ఓటి డిసిపి 1 గిరిధర్, మహేశ్వరం డిసిపి శ్రీనివాస్, ఎస్బీ డీసీపీ బాలస్వామి, డీసిపి సైబర్ క్రైమ్ అనురాధ, డీసీపీ అడ్మిన్ ఇందిరా, ఎల్బి నగర్ డీసీపీ సాయి శ్రీ, ట్రాఫిక్ డీసీపీ 2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, డీసీపీ క్రైమ్స్ అరవింద్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News