Saturday, April 27, 2024

ఓ అధికారిని చెప్పుతో కొట్టిన టిక్‌టాక్ స్టార్ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

Tiktok star Sonali Phogat who struck an officer

చండీగఢ్ : బిజెపి నాయకురాలిగా మారిన టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ ఓ అధికారిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అయింది. హర్యానాలోని హిసార్‌లో ఈ సంఘటన జరిగింది. హిసార్ మార్కెట్ కమిటీ కార్యదర్శి సుల్తాన్‌సింగ్‌ను ఫోగట్ చెప్పుతో కొట్టారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులు తనకు ఫిర్యాదు చేయగా మార్కెట్‌కు వెళ్లినపుడు ఈ సంఘటన జరిగిందని ఫోగట్ తెలిపారు. తనను అసభ్య పదజాలంతో దూషించినందునే కోపం అణచుకోలేక చెప్పుతో కొట్టానని ఫోగట్ వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై తమకు సుల్తాన్‌సింగ్ నుంచి ఫిర్యాదు అందినట్టు హిసార్ ఎస్‌పి తెలిపారు. మరోవైపు సుల్తాన్‌సింగ్‌పై తాను కూడా ఫిర్యాదు చేసినట్టు ఫోగట్ తెలిపారు.

Tiktok star Sonali Phogat who struck an officer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News