Monday, April 29, 2024

తొలగని తేడాలు

- Advertisement -
- Advertisement -

To eradicate poverty Judiciary must work:CJI

అసమసమాజం అవాంఛనీయం

రాజ్యాంగ మౌలికస్ఫూర్తికి విఘాతం
ఆకలితో కూడిన స్వేచ్ఛ ఇవ్వడం మనిషిని
అవహేళన చేయడమే, ఆర్థిక స్వాతంత్య్రం లేని
స్వాతంత్య్రం వ్యర్థం, పేదరిక నిర్మూలనకు
న్యాయవ్యవస్థ కృషిచేయాలి : సిజెఐ ఎన్.వి.రమణ

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికీ విభజన రేఖలు విస్తరించుకుని ఉన్నాయనేది బాధాకరమైన చేదునిజమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తెలిపారు. ఉన్న వారు లేనివారనే చెదిరిపోని తేడాలు ఇప్పటికీ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నెలకొన్న దేశంలోని పేదరిక నిర్మూలనకు, విభజనరేఖల తొలిగింపునకు న్యాయవిభాగం కృష్టి చేయాల్సి ఉందని పిలుపు నిచ్చారు. దేశ ప్రధమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంత్రి సందర్భంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథార్టీ ఏర్పాటు చేసిన దేశవ్యాప్త న్యాయచైతన్య, ప్రచార కార్యక్రమాన్ని ఉద్ధేశించి ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించారు. సమాజానికి శాపమైన అంశాలను కనుగొని వీటికి విరుగుడును కనుగోనాల్సిన బాధ్యత న్యా యవ్యవస్థపై ఉందన్నారు. మనది సంక్షేమ దేశం అనే ఖ్యాతిని దక్కించుకుంది. అయితే ప్రయోజనాలు ఏ మేరకు చేరాల్సిన వారికి, చెందాల్సిన వర్గాలకు చెందుతున్నాయి? ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజానికి పేద ధనిక లేమికలిమిల తేడాలు ఇప్పటికీ గోచరిస్తూనే ఉన్నాయని తెలిపారు. ప్రజలు తాము గౌరవప్రద జీవితాలను గడపాలని అనుకుంటారు.

సరైన జీవన ప్రమాణాలను కోరుకుంటారు. అయితే ఈ దిశ లో వారికి పలు సవాళ్లు చిక్కులు ఎదురవుతున్నా యి. ప్రగతిశీల దేశంలో విభజిత ఛాయల సమా జం ఉండటం అత్యంత బాధాకరం అని సిజెఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక స్వాతంత్య్రం లేనప్పుడు నిజమైన స్వాతంత్య్రం లేనట్లే, రానట్లే అని, మనిషికి ఆకలితో కూడిన స్వేచ్ఛను ఇవ్వడం అనేది కేవలం మనిషిని గేలిచేయడం అవుతుందని వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్య్రంతోనే లక్షం పూర్తి అయిందని అనుకోవడం కుదరదని , నిజానికి దేశ స్వాతంత్య్ర ఉద్యమపు ప్రాధమిక లక్షం స్వేచ్ఛా స్వాతంత్రాలతో పాటు అందరికీ గౌరవప్రద జీవితకల్పన అని తెలిపారు.

వలసపాలకులు ఈ దేశంలోని పేదరికాన్ని ఈసడించుకున్నారు. ఇక్కడి ప్రజల దురదృష్టం వారి ఖర్మ అనే వ్యాఖ్యానాలకు దిగారు. దీనిని రూపుమాపేందుకు ఏ చట్టం ఏమీ చేయలేదని కూడా సెలవిచ్చారు. ఈ పరాయి మనస్తత్వపు ధోరణిపై ఆగ్రహంతోనే దేశ స్వాతంత్ర ఉద్యమం ఆవిర్భవించింది. బలోపేతం అయ్యి లక్షాన్ని సాధించుకుందని తెలిపారు. అయితే దీనికి విరుద్ధంగా సమాజంలో ఆర్థిక స్వేచ్ఛ సార్వత్రికం కాకపోతే ఇక మన సాధనకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. మన పోరు, మన ఆకాంక్షలు మన రాజ్యాంగానికి రూపం ఇచ్చాయి. ఈ జాతీయ రాజ్యాంగపత్రం మనకు విశాలప్రాతిపదిక భవిష్యత్తును వాగ్దానం చేసిందని ప్రధాన న్యాయమూర్తి గుర్తుచేశారు.

స్వతంత్ర న్యాయవ్యవస్థనే కీలకం

దేశానికి అత్యంత పటిష్టమైన స్థానిక న్యాయవ్యవస్థ, స్వేచ్ఛాయుత ప్రక్రియతో నిర్వహణ అనేది కీలకం అని ఇదే యావత్తూ న్యాయవ్యవస్థకు సరైన ముఖచిత్రం అవుతుందన్నారు. మారుమూల ప్రాంతాలలోని ఓ మహిళ నిస్సహాస్థితిలో ఉన్నా, ఓబాలుడికి ఆశ్రయం అవసరం అయినా , అక్రమంగా నిర్బంధానికి గురైన వ్యక్తి సాయం కోరినా ఆదుకునే రీతిలో ట్రయల్ కోర్టులు ఉండాలి. ఇదే న్యాయవ్యవస్థ సమగ్రతకు ప్రాతిపదిక అవుతుందన్నారు. ట్రయల్ కోర్టులలో తీసుకునే చర్యలు, తీర్పులు క్రమంలోనే భారతీయ జుడిషయరీ తీరుతెన్నులు ఏమిటనేది తేటతెల్లం అవుతుంది. డిస్ట్రిక్ జుడిషియరీనే న్యాయానికి ఆయువుపట్టు అవుతుందని చెప్పారు. అట్టడుగు స్థాయి వరకూ న్యాయవ్యవస్థ పటిష్టత, సరైన న్యాయపంపిణీ క్రమం ఉంటేనే అత్యధిక సంఖ్యాక కక్షిదారులకు సరైన మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యాయం అవసరం అయిన పేదవద్దకు వెళ్లాలి

న్యాయవ్యవస్థ పరిపూర్ణత కేవలం పేదకు కూడా సరైన సత్వర న్యాయంతోనే దక్కుతుంది. పేదలు బాధలతో న్యాయపరమైన చిక్కులలో ఉన్నప్పుడు దిక్కుతోచనిస్థితిలోపడుతారు. వారికి ఎటుపోవాలో తెలియదు. సూటుబూటు, దర్జాలతో ఉన్న లాయర్లు, కోర్టు గుమ్మాలను దాటిపోవాలంటేనే భయపడుతారు. అంతేకాదు ఈ విధమైన ఖరీదైన న్యాయం వారికి అందకుండా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సామాన్యుడి వద్దకే న్యాయం వెళ్లితేనే న్యాయం పరిపూర్ణం అవుతందని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. పేదల వనరులన్ని హరించకుండా వారికి సరైన న్యాయం సకాలంలో అందితే అదే పదివేలు అని, సగటు మనిషి న్యాయవ్యవస్థ నుంచి కోరుకునేది ఇదేనని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News