Monday, November 4, 2024

టాలీవుడ్ ను కుదుపేసిన డ్రగ్స్ వ్యవహారం

- Advertisement -
- Advertisement -

Tollywood actress arrested in Mumbai

హైదరాబాద్: టాలీవుడ్‌ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తుంది. ముంబయిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ సప్లయర్‌తో టాలీవుడ్ నటి పట్టుబడింది. ఎన్‌సిబి అధికారులు కాసేపట్లో ముంబయి కోర్టులో సదరు హీరోయిన్‌ను ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ చాంద్, డ్రగ్ పెడ్లర్ సయ్యద్‌తో టాలీవుడ్ హీరోయిన్‌కు ఉన్న సంబంధాలపై ఎన్‌సిబి ఆరా తీసింది. నాలుగు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ముంబయిలో దొరికిన టాలీవుడ్ నటికి మాఫియా డాన్‌తో సంబంధాలున్నట్టు సమాచారం. మాఫియా డాన్ కరీంలాలాతో కలిసి నటి డ్రగ్స్ బిజినెస్ చేస్తోంది. బాంద్రా, కుర్ల, అందేరిలో జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మీరా రోడ్డులోని ఓ హోటల్‌లో హీరోయిన్‌తో పాటు మరో ఇద్దరిని ఎన్‌సిబి అధికారులు పట్టుకున్నారు. 400 గ్రాముల డ్రగ్స్‌ను ఎన్‌సిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాఫియా డాన్ కరీంలాలా కోసం ఎన్‌సిబి అధికారులు గాలిస్తున్నారు. కరీం దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను ఎన్‌సిబి అప్రమత్తం చేసింది. హీరోయిన్ పారిపోవడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News