Saturday, April 27, 2024

వృద్ధాశ్రమం పేరుతో మెంటల్ క్యాంపు

- Advertisement -
- Advertisement -

Old Age home

 

మానసిక వికలాంగులకు చిత్రహింసలు

కీసర (మేడ్చల్ జిల్లా): వద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగులను బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన మేడ్చల్ జిల్లా, కీసర మండలం, నాగారంలో శుక్రవారం వెలుగుచూసింది. నాగారంలోని మమత వృద్ధాశ్రమం నిర్వాహకులు చేస్తున్న ఘోరాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధాశ్రమంలోని 82మంది మానసిక వికలాంగులు, వృద్ధులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనుమతి లేకుండా ఆశ్రమం నడుపుతూ ఒక్కొక్కరి నుంచి రూ. 15వేలు వసూలు చేస్తున్న నిర్వాహకులు, మానసిక వికలాంగుల గొలుసులతో బంధించి, విచక్షణ రహితంగా కొడుతున్నట్లు పోలీసుల విచారణలో వెళ్లడైంది. గత బుధవారం రాత్రి నాగారం శిల్పనగర్‌లోని మమత ఆశ్రమం నుంచి మహిళల ఆర్తనాదాలు విన్న స్థానికులు 100కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నగర శివారులోని నాగారం శిల్పనగర్‌లో రెండు పడకల భవనాన్ని అద్దెకు తీసుకున్న ప్రభుదాస్ తన కుటుంబ సభ్యులు జాన్ రజత్‌పాల్, భారతి, భాను, అరుణాచలంతో కలిసి నాలుగేళ్లుగా మమత వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ తరువాత పక్కనే ఉన్న మరో భవనాన్ని అద్దెకు తీసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా మానసిక వికలాంగులకు చికిత్స పేరుతో రీహబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. కేవలం 16 మందితో ఆశ్రమాన్ని నడుపుతున్నట్లు చెప్పుకొచ్చిన నిర్వాహకులు వృద్ధు లు, మానసిక వికలాంగులు, మత్తు పదార్థాలకు అలవాటుపడిన 85 మంది వ్యక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేని రెండు భవనాల్లోని ఇరుకు గదు ల్లో ఉంచి ఆశ్రమాన్ని నడుపుతున్నారు.

మానసిక వికలాంగులను గొలుసులతో బంధించారు. ఆశ్రమంలో మానసిక రోగులను గొలుసులతో కట్టేసిన దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో మల్కాజిగిరి డిసిపి రక్షిత కృష్ణమూర్తి, కుషాయిగూడ ఎసిపి శివకుమార్, కీసర సిఐ నరేందర్‌గౌడ్ ఆశ్రమాన్ని సందర్శించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి, మేడ్చల్ జిల్లా సఖీ కేంద్రం నిర్వాహకురాలు పద్మావతి విచారణ చేపట్టారు. ఎలాంటి అనుమతులు పొందకుండా మానసిక వికలాంగుల కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక భవనంలో 21 మంది మహిళలను, మరో భవనంలోని ఇరుకు గదుల్లో 61 మంది పురుషులను ఉంచినట్లు గుర్తించారు.

Torture of disabled persons in name of Old Age home
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News