Monday, April 29, 2024

బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విసుగు… బిఆర్ఎస్‌ వైపు…యువత చూపు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ :  బిజెపి పాలనతో విసుగు చెందిన యువత టీఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధి లోని వార్డ్ 1,2,14 ల బిజెపి , కాంగ్రెస్ ల కు 300 మంది యువకులు గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ తీర్థం పుచ్చకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారం లోకి వచ్చాక రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను ఊడతీస్తుండడంతో యువత కేంద్రం తీరుపై విసుగు చెందుతున్నారన్నారని అన్నారు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిన మోడీ ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, రైల్వేతో పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ కు రంగం సిద్దం చేసుకుందని వాపోయారు.

బిజెపి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. మతంపేరుతో రాజకీయం చేస్తూ దేశంలో చిచ్చుపెడుతున్నదని ధ్వజమెత్తారు. బిజెపి, కాంగ్రెస్ ల వల్ల భారత్‌ తిరోగమనంలో పయనిస్తున్నదన్నారు. దేశానికి వ్యవసాయమే ప్రధాన ఆధారమైనా ఈ రంగాన్ని గాలికొదిలేశారన్నారు. బిజెపి ప్రభుత్వ హయాం లో పేదలు మరింత పేదరికంలోకి వెళ్తుండగా, సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటున్నారని అన్నారు. ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, అనేక సామాజిక జాఢ్యాలతో దేశం నేడు సంక్షుభితంగా మారిపోయిందన్నారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి ల లో ఏ పార్టీ కూడా మౌలిక సమస్యలను పరిష్కరించడం లేదన్న మంత్రి కనీసం ఆ వైపు చొరవ చూపడం లేదన్నారు.

ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు ఆ రెండు పార్టీలను ఎన్నుకొంటున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి నూతన పార్టీ బిఆర్ఎస్, సమర్థ నాయకత్వం కేసీఆర్ రూపం లో దొరింకిందన్నారు.. దేశ ప్రజల కలలను సాకారం చేసే నాయకుడు కేసీఆర్ మాత్రమే అన్నా మంత్రి , దేశంలో రైతుల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణలోనే అని అన్నారు. కాంగ్రెస్‌, బిజెపిపాలనతో యువత, మేధావులు, సామాన్య ప్రజానీకం విసుగెత్తిపోయి దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.

అన్నిరాష్ర్టాల వారు కెసిఆర్‌ పార్టీ గురించి చర్చిస్తున్నారన్నారని అన్నారు. రాబోయే కాలంలో దేశం గొప్ప మలుపు తిరగబోతున్నదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. దేషోజు రవి అధ్వర్యంలో లో ,మహంకాళిశివ, ప్రసన్న,శ్రవణ్, వంశీ, కార్తిక్, సాయి,ప్రసాద్ , అశోక్, పవన్, సందీప్ ,సాయి,చింటులతో పాటు వారి అనుచరులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ లో చేరగా కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు గుర్రం సత్యనారయణ రెడ్డి, జడ్పీటిసి సంజీవ నాయక్, చివ్వెంల వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి , పెన్ పహాడ్ ఎంపిపి నేమ్మాధి బిక్షం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News