Saturday, April 27, 2024

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic restrictions for Vice President's visit in City
ఉపరాష్ట్రపతి పర్యటన

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి నగర పర్యటన వల్ల శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 4వ తేదీన బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు. రోడ్డు నంబర్ 29, జూబ్లీహిల్స్, హైదరాబాద్ వయా పిఎన్‌టి ఫ్లైఓవర్, శ్యామల్‌లాల్ బిల్డింగ్, హెచ్‌పిఎస్ బేగంపేట, బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి రోడ్డు నంబర్ 29, జూబ్లీహిల్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండడనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News