Monday, May 6, 2024

టిఎస్ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌:  తెలంగాణ‌ ఎంసెట్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం విడుదల చేసింది. ఈ నెల 18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు విద్యా మండలి వెల్లడించింది. జులై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఆసల్య రుసుముతో జూన్ 28వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చని తెలపింది. ఇక, 5, 6వ తేదీల్లో అగ్నికల్చర్, ఫార్మా‌ పరీక్షలు.. 7, 8, 9వ తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలను నిర్వహించనునట్లు వెల్లడించింది. కాగా, ఎంసెట్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 100 శాతం, సెకండ్ ఇయర్‌లో 70 శాతం సిలబస్‌ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

TS EAMCET 2021 Exam Schedule Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News