Monday, April 29, 2024

ముగిసిన ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు

- Advertisement -
- Advertisement -

ముగిసిన ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు
16న తొలి విడత సీట్ల కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. మొత్తం 81,856 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోగా, అందులో బుధవారం వరకు 75,172 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 49,42,005 వెబ్ ఆప్షన్లు నమోదు కాగా, ఒక అభ్యర్థి అత్యధికంగా 1,109 ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. ఈ నెల 16వ తేదీన మొదటి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు.

వెబ్ ఆప్షన్లలో కంప్యూటర్ సైన్స్‌కే అధికం
ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు సిఎస్‌ఇకే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటున్నారు. మొత్తం 49,42,005 వెబ్ ఆప్షన్లు నమోదు కాగా, అందులో 70 శాతానికిపైగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ బ్రాంచీలకే వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. పదేళ్ల క్రితం వరకు మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇఇఇ బ్రాంచ్‌లకు డిమాండ్ ఉండేది. సాఫ్ట్‌వేర్ రంగంలో పెరిగిన ఉద్యోగ అవకాశాలు, కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలతో క్రమంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. డిమాండ్‌కు అనుగుణంగా కాలేజీలు, యూనివర్సిటీలు సైతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఏటా సీట్లు పెంచుకుంటున్నాయి. దీంతో సిఎస్‌ఇ బ్రాంచీలో ఏటా సీట్లు పెరుగుతున్నాయి.

కన్వీనర్ కోటాలో 76,359 సీట్లు
రాష్ట్రంలో 155 ఇంజనీరింగ్ కాలేజీలు, 16 యూనివర్సిటీ కాలేజీలు, రెండు ప్రైవేట్ యూనివర్సిటీలలో కన్వీనర్ కోటా కింద 76,359 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో వచ్చాయి. వీటిలో సిఎస్‌ఇలో అత్యధికంగా ప్రైవేట్ కాలేజీల్లో 20,429 సీట్లు అందుబాటులో ఉండగా, యూనివర్సిటీ కాలేజీల్లో 1,074 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది. అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగతా సీట్లు మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాలో కాలేజీలు భర్తీ చేసుకుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News